ముఖాన్ని వైట్‌గానే కాదు స్మూత్ అండ్‌ షైనీగా గా కూడా మార్చే హోం మేడ్ క్రీమ్ ఇదే!

ముఖం వైట్‌గా ఉంటే స‌రిపోదు స్మూత్ గా మరియు షైనీగా కూడా ఉండాలి.

అప్పుడే అందంగా, ఎట్రాక్టివ్‌గా క‌నిపిస్తారు.అయితే అందుకోసం ఓ హైరానా ప‌డిపోవాల్సిన అవ‌స‌రం లేదు.

ఖ‌రీదైన క్రీములు, సీర‌మ్స్‌ను కోనుగోలు చేసి వాడాల్సిన అవ‌స‌రం అంత‌కంటే లేదు.ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ క్రీమ్ ను వాడితే ముఖం వైట్‌గానే కాదు స్మూత్ అండ్ షైనీగా కూడా మారుతుంది.

మ‌రి ఇంత‌కీ ఆ ఫేస్ క్రీమ్‌ను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక ప‌ల్చ‌టి వ‌స్త్రం తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి.

దానిలో ఉండే నీరును పూర్తిగా తొల‌గించి పెట్టుకోవాలి.ఇప్పుడు రెండు లేదా మూడు ట‌మాటోల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఈ ముక్క‌ల‌ను మెత్త‌గా పేస్ట్ చేసి.స్ట్రైన‌ర్ సాయంతో జ్యూస్ ను స‌ప‌రేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ట‌మాటో జ్యూస్ వేసుకోవాలి.

ఈ ట‌మాటో జ్యూస్‌ను క‌నీసం ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు హీట్ చేసుకుని.

చ‌ల్లార‌బెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వాట‌ర్ తొల‌గించిన పెరుగును వేసుకోవాలి.

అలాగే హీట్ చేసి చ‌ల్లార‌బెట్టుకున్న ట‌మాటో జ్యూస్ మూడు టేబుల్ స్పూన్లు, లెమ‌న్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్‌, రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ రెండు చుక్క‌లు వేసి బాగా మిక్స్ చేసుకుంటే క్రీమ్ సిద్ధ‌మైన‌ట్లే.

"""/"/ ఈ క్రీమ్‌ను ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే నాలుగైదు రోజులు నిల్వ ఉంటుంది.

రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేక‌ప్‌ను తొల‌గించి వాట‌ర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత త‌యారు చేసి పెట్టుకున్న క్రీమ్‌ను అప్లై చేసుకుని పడుకోవాలి.రోజు ఈ విధంగా చేస్తే మీ ముఖ చ‌ర్మం తెల్ల‌గా, మృదువుగా మ‌రియు కాంతివంతంగా మారుతుంది.

Game Load Optimization & Casino Advertising Ethics For Canadian High Rollers