బంగారంలో బప్పి లహరికి తోపు ఇతనే...ఏకంగా శరీరంపై అంత బంగారం...!!
TeluguStop.com

బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.ఆడవాళ్ళ సంగతి అయితే అసలు చెప్పక్కర్లేదు.


అలాగే కొంత మంది మగవాళ్లకి కూడా బంగారం కూడా మక్కువ ఎక్కవ అనే చెప్పాలి.


బంగారాన్ని ఇష్టపడే వాళ్లలో బప్పీలహరి కూడా ఒకరు.నిజానికి బాలీవుడ్‌కు డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసిన సింగర్ బప్పి లహరి అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.
సంగీత ప్రపంచంలో బప్పీలహరి యొక్క పాటలు కానివ్వండి అయన స్టైల్ కానివ్వండి కొద్దిగా ప్రత్యేకం అనే చెప్పాలి.
బప్పీలహరి పాటలతోనే కాకుండా ప్రత్యేకమైన ఆహార్యంతోనూ ప్రేక్షకుల మదిలో నిలిచి పోయారు.
అయన చేతికి గోల్డ్ రింగ్స్, నల్లని కళ్లద్దాలు మెడలో కిలోల కొద్దీ బంగారు గొలుసులు వేసుకుని చూడడానికి అందరి కంటే కాస్త భిన్నంగా కనిపిస్తారు.
అసలు ఆయన నడిచొస్తుంటే బంగారమే కదిలొస్తున్నట్లు కనిపించేది.బంగారం లేకుండా అసలు బప్పీలహరిని ఊహించుకోలేం.
బంగారం అంటే ఆయనకు ఎందుకు అంత ఇష్టం అంటే బంగారం తనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందన్నది ఆయన ప్రగాఢ నమ్మకం.
అయితే బప్పిలహరికి మించిన బంగారు బాబు మరొకరు ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు.
అయన పేరు ట్రాన్‌డక్‌లాయ్. """/" /
అయన వియత్నాంలో నివసించే వ్యక్తి.
అతను బంగారాన్ని మరింత ఎక్కువగా నమ్ముతాడు.అందుకే ఎప్పుడూ తన శరీరం మీద రెండు కిలోలకు తక్కువ కాకుండా బంగారాన్ని దరిస్తూ ఉంటాడు.
అంతేకాదండోయ్ ఈ వ్యక్తి ఉపయోగించే కారు, బైక్ అన్నీ కూడా గోల్డ్ ప్లేటింగ్ తోనే తయారు చేయించేశాడు.
ఈ విధంగా అయన లోకల్‌గా బాగా పాపులర్ అయ్యాడు.అసలు ఇంతకీ ఇతను ఏమి చేస్తాడు.
ఇంత బంగారం ఎక్కడిది అనే కదా మీ డౌట్.నిజానికి వియత్నాంలో దక్షిణ అమెరికా బల్లులను పెంపుడు జంతువులుగా బాగా పెంచుకుంటారు.
వాటిని పట్టుకొచ్చి ట్రాన్‌డక్‌లాయ్ అక్కడి వారికీ అమ్ముతూ సొమ్ము చేసుకుంటాడు.అలా వచ్చిన డబ్బులతో బంగారాన్ని కొని మనోడు దరిస్తాడన్నమాట.
ఎన్ఆర్ఐ కోటా మెడికల్ సీట్లలో అక్రమాలు .. బెంగాల్‌లో ఈడీ దాడులు