హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా శుభవార్త ఇదే!

అవును, మీరు విన్నది నిజమే.ఇపుడు అమెరికాలో పనిచేస్తున్న హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం తీపి కబురు తీసుకు వచ్చింది.

10వేల మంది హెచ్‌-1బీ వీసాదారులు తమ దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించినట్టు తెలుస్తోంది.

దానికోసం ఓపెన్‌ వర్క్‌-పర్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ మంత్రి సీన్‌ ఫ్రేజర్‌( Sean Fraser ) తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ ప్రొగ్రామ్‌ కింద హెచ్‌-1బీ వీసాదారుల కుటుంబసభ్యులు చదువుకోవడం, పనిచేసేందుకు అనుమతి కల్పించనున్నట్లు కూడా చెప్పడం విశేషం.

"""/" / ఈ విషయమై కెనడా వలసలు, శరణార్థులు, పౌరసత్వ సేవల శాఖ అధికారిక ప్రకటన ఒకటి విడుదల చేయడం జరిగింది.

ఆ ప్రకటనలో ఏముందంటే.''హైటెక్‌ రంగాలకు చెందిన కొన్ని కంపెనీలు అమెరికా, కెనడా రెండు దేశాల్లోనూ పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

ఈ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులు పని చేయడం జరుగుతుంది.కాగా ఇందులో చాలా మంది హెచ్‌-1బీ వీసాదారులే ఉండడం గమనార్హం.

జులై 16, 2023 నాటికి హెచ్‌-1బీ వీసాలో అమెరికాలో( America ) పనిచేస్తున్నవారు, ఈ వీసాదారులతో వచ్చే కుటుంబసభ్యులు కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు!'' అని ఆ ప్రకటనలో వెల్లడించారు.

"""/" / ఇపుడు ఈ విషయం కెనడా వెళ్లి సెటిల్ కావాలని అనుకున్నవారికి వరంగా మారనుంది.

ఈ కొత్త ప్రోగ్రామ్‌ కింద.ఆమోదం పొందిన హెచ్‌-1బీ వీసాదారులకు మూడేళ్ల కాలావధితో ఓపెన్ వర్క్ పర్మిట్ లభిస్తుంది.

వారు కెనడాలో ఎక్కడైనా, ఏ యజమాని వద్దనైనా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది.అంతేకాకుండా వారి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు కూడా కెనడాలో ఉద్యోగం లేదా చదువుకునేందుకు తాత్కాలిక నివాస వీసాకు దరఖాస్తు చేసుకొనే వీలుంది.

అయితే, ఈ స్ట్రీమ్‌ కింద దరఖాస్తు చేసుకునేందుకు ఎవరెవరు అర్హులు అనేది మాత్రం ఆయన స్పష్టంగా చెప్పలేదు.

టెక్నాలజీ సహా కొన్ని ప్రత్యేక రంగాల్లో అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా విదేశీయులకు హెచ్‌-1బీ వీసాలను జారీ చేస్తుంటారు.

వీరిలో అత్యధికంగా భారతీయులే ఉండడం గమనార్హం.