మ‌న దేశానికి చెందిన తొలి న‌దీ నౌక ఇదే.... జిమ్, స్పా, ఓపెన్ స్పేస్ బాల్కనీతొ పాటు ఈ సౌక‌ర్యాలు కూడా...

జనవరి 13న వారణాసి నుంచి బంగ్లాదేశ్ మీదుగా దిబ్రూగఢ్ వరకు ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్ ప్ర‌యాణానికి సిద్ధం కానుంది.

దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించ‌నున్నార‌ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలియజేశారు.

ఈ క్రూయిజ్‌లో ప్ర‌యాణించే పర్యాటకులు 50 రోజుల్లో 3200 కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేయనున్నారు.

ఈ జ‌ర్నీలో ప్రయాణికులు భారతదేశం, బంగ్లాదేశ్‌లోని 27 నదీ వ్యవస్థల గుండా వెళ్ల‌నున్నారు.

అలాగే 50కి మించిన‌ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, నిర్మాణపరంగా ఎంతో ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించ‌నున్నారు.

H3 Class=subheader-styleఒకేసారి 80 మంది ప్రయాణించవచ్చు/h3p గంగా విలాస్ క్రూయిజ్ షిప్‌లో 80 మంది ప్రయాణికులు కలిసి ఒకేసారి ప్రయాణించే అవ‌కాశంఉంది.

ఈ క్రూయిజ్‌లో 18 సూట్‌లు, అన్ని ఇతరత్రా సంబంధిత సౌకర్యాలు ఉన్నాయి.ఇక్క‌డ ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇది భారతదేశంలోని మొట్ట‌మొద‌టి నదీ నౌక.

కొంతకాలం క్రితమే విడుదల చేసిన టైమ్‌టేబుల్ ప్రకారం, గంగా విలాస్ క్రూయిజ్ వార‌ణాసి నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి 8 రోజుల త‌రువాత‌ బక్సర్, రామ్‌నగర్ మరియు ఘాజీపూర్ మీదుగా పాట్నా చేరుకోనుంది.

"""/"/ పాట్నా నుంచి కోల్‌కతాకు బయలుదేరి ఫరక్కా, ముర్షిదాబాద్ మీదుగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌క‌తాకు 20వ రోజున క్రూయిజ్‌ చేరుకుంటుంది.

మరుసటి రోజు అది ఢాకాకు బయలుదేరి బంగ్లాదేశ్ సరిహద్దుల‌లోకి ప్రవేశిస్తుంది.త‌రువాతి రాబోయే 15 రోజుల పాటు ఆ దేశ జలాల్లోనే ఉంటుంది.

చివరగా ఇది శివసాగర్ మీదుగా ప్రయాణించే ముందు గౌహతి మీదుగా భారతదేశానికి తిరిగి చేరుకుంటుంది.

దిబ్రూఘర్ వద్ద తన చివరి గమ్యస్థానానికి చేరుకుంటుంది. """/"/ H3 Class=subheader-styleక్రూయిజ్‌లో హైటెక్ సౌకర్యాలు/h3p ఈ క్రూయిజ్ సుందర్‌బన్స్ డెల్టాతో పాటు కజిరంగా నేషనల్ పార్క్‌తో సహా జాతీయ పార్కులు, అభయారణ్యాల మీదుగా కూడా వెళుతుంది.

క్రూయిజ్ అనుభవాన్ని ఆహ్లాదకరంగా చేయడానికి రోజంతా సంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

అలాగే దీనిలో జిమ్, స్పా, ఓపెన్ స్పేస్ బాల్కనీ, బట్లర్ సర్వీస్ మొదలైన అన్ని హైటెక్ సౌక‌ర్యాలు అందుబాటులో ఉంటాయి.

ఈ క్రూయిజ్‌లో ప్ర‌యాణించేందుకు చాలామంది ఆస‌క్తి చూపిస్తున్నారు.

బ‌రువు త‌గ్గాల‌ని భావించేవారు క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే..!