వచ్చే సంవత్సరం మొదటి కాలాష్టమి తేదీ ఇదే..! ఆరోజు ఏం చేయాలి..? ఏం చేయకూడదు..?
TeluguStop.com
కలాష్టమి రోజున కాలభైరవ దేవుడిని పూజించాలని నియమం ఉంది.అయితే కలాష్టమి( Kalashtami ) రోజు రాత్రి తంత్ర శాస్త్రం నేర్చుకున్న వారు ప్రత్యేక పూజలు చేస్తారు.
అలాగే కలాష్టమి రోజున కొన్ని పనులు చేయడం నిషిద్ధమని, అలా చేయడం వలన కాలభైరవుడికి కోపం వస్తుందని, దీని వలన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు.
అయితే ప్రతినెల కృష్ణపక్షం ఎనిమిదో రోజున కలాష్టమి జరుపుకుంటారు.ఈరోజున కాలభైరవుడి( Kalabhairava )ని పూజించాలని నియమం ఉంది.
ఈసారి వచ్చే సంవత్సరంలో మొదటి కలాష్టమి జనవరి 4వ తేదీన వస్తోంది.కలాష్టమి రోజు రాత్రి తంత్ర శాస్త్రం నేర్చుకున్న అభ్యాసకులు ప్రత్యేక పూజలు చేస్తారు.
అయితే కలాష్టమి నాడు ఏం చేయాలి? ఏం చేయకూడదో? ఇప్పుడు తెలుసుకుందాం.ఆ రోజున కాలభైరవుడికి నిమ్మకాయల మాల సమర్పించి, ఆశీస్సులు తీసుకోవాలి.
అంతేకాకుండా ఆరోజు భక్తి శ్రద్ధలతో పేదలకు దానం కూడా చేయాలి.కలాష్టమి సందర్భంగా కాలభైరవుని సుత్తి పాడాలి.
కలాష్టమి నాడు కాలభైరవుడిని నియమాల ప్రకారం పూజించాలి.కాలభైరవుడికి జిలేబిలు, స్వీట్లను సమర్పించాలి.
ఇక కలాష్టమి రోజున ఏం చేయకూడదో తెలుసుకుందాం.కలాష్టమి నాడు ఎవరిని కూడా అవమానించకూడదు.
అలాగే కాలభైరవుడిని పూజించడం కోసం ఎవరిని కూడా నాశనం చేయకూడదు. """/" /
ఇక ముఖ్యంగా ఈరోజు మాంసాహారం అస్సలు తినకూడదు.
ఇక పదునైన వస్తువులను అస్సలు ఉపయోగించకూడదు.ఇక ఆ రోజున ఏ జంతువులను గాని, పక్షిని గాని ఇబ్బంది పెట్టకూడదు.
ఇక కలాష్టమి కాలభైరవుడికి అంకితం చేయబడింది.కాబట్టి కాలభైరవుడిని పూజించడం వలన జీవితంలో చేసిన పాపాలు, కర్మ, దుఃఖం అంతా తొలగిపోతాయని నమ్ముతారు.
ఈ రోజున ఉపవాసం ఉండడం వలన కూడా కాలభైరవుని ఆశీస్సులు పొందుతారు.అలాగే ఆయన అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుందని నమ్మకం ఉంటుంది.
కలెక్టర్లతో నేడు ,రేపు సదస్సు.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న బాబు