తండ్రి అంటే ఇతడే.. కూతురు కోసం ఎలాంటి వెహికల్ తయారు చేసాడో చూడండి!

సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను సంతోషపెట్టడానికి ఎంతటి పని అయినా చేస్తారు.ముఖ్యంగా తండ్రులు తమ బిడ్డలను ఖుషి చేసేందుకు చాలా కష్టపడతారు.

కూతుర్ల సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు.తాజాగా తండ్రి ప్రేమ మరొకసారి నిరూపితమయింది.

దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోని ఫ్యూబిటీ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్నారి కూలింగ్ గ్లాసెస్ ధరించి ఉండటం గమనించవచ్చు.

ఆపై ఈ బాలిక అవతార్ సినిమాలో కనిపించిన వాహనం లాంటి ఒక పెట్టెలో కూర్చోడం చూడొచ్చు.

ఆ చిన్నారి అలా కూర్చోగానే ఆ పెట్టెలోని ముందు భాగం రోబో లాగా ఒక షీల్డ్ ఏర్పాటు చేసింది.

అనంతరం అదంతట అదే తిరుగుతూ చిన్నారికి ఒక మంచి రైడ్ ఇచ్చింది.అయితే ఈ పెట్టె దానంతటదే తిరగలేదు.

దీనిలోపల ఆ చిన్నారి తండ్రి ఉన్నాడు.అతడే ఈ రోబో లాంటి వాహనాలు తిప్పుతూ చిన్నారికి ఒక మంచి అనుభూతిని కలిగించాడు.

ఆ తర్వాత నెమ్మదిగా ఆ అమ్మాయిని కిందకి దించాడు.అలా ఆ చిన్నారి కోరికను తీర్చి తన తండ్రి హృదయాన్ని చాటుకున్నాడు.

ఈ వీడియోని తల్లి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇప్పుడు అది కాస్తా వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజనులు ఈ పాప డాడీ ని బాగా పొగుడుతున్నారు.

ఇతడే అసలైన తండ్రి అంటే, హ్యాట్సాఫ్ టు యు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

పవన్ కళ్యాణ్ చేసే ఈ మూడు సినిమాల్లో ఏది బ్లాక్ బస్టర్ అవుతుందంటే..?