ఆ ఒక్క సినిమా చేయడమే శర్వా కెరీర్ కు శాపంగా మారిందా.. అలా నష్టపోయాడా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో శర్వానంద్( Hero Sharwanand ) కు ప్రత్యేక గుర్తింపు ఉంది.

శర్వానంద్ కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి.ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కిన శర్వానంద్ సినిమాలు శర్వానంద్ కు సక్సెస్ ను అందించాయి.

గమ్యం, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు( Mahanubhavudu ) సినిమాలు శర్వానంద్ కెరీర్ లో స్పెషల్ సినిమాలు అని చెప్పవచ్చు.

ఈ సినిమాలు నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందించాయి.అయితే శర్వానంద్ తన సినీ కెరీర్ లో ఒక సినిమా చేయడం మాత్రం ఆయన కెరీర్ కు శాపంగా మారిందని చెప్పవచ్చు.

కో అంటే కోటి( Ko Ante Koti ) అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో శర్వానంద్ నటించగా 2012 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది.

"""/"/ విచిత్రం ఏంటంటే ఈ సినిమాకు శర్వానంద్ నిర్మాతగా కూడా వ్యవహరించారు.నిర్మాతగా కచ్చితంగా క్లిక్ అవుతానని అనుకున్న శర్వానంద్ ఆశలకు ఈ సినిమా చెక్ పెట్టింది.

కో అంటే కోటి సినిమా చేయడం వల్ల శర్వానంద్ ఏ స్థాయిలో నష్టపోయారంటే ఈ సినిమా నష్టాలను తీర్చడానికి శర్వానంద్ మరో ఆరు సినిమాలలో నటించాల్సి వచ్చింది.

శర్వానంద్ కు ఈ మధ్య కాలంలో కూడా సరైన హిట్ లేదు.చాలామంది యంగ్ హీరోలు( Young Heroes ) వరుసగా విజయాలు అందుకుంటుంటే శర్వానంద్ మాత్రం వరుస పరాజయాలతో తన మార్కెట్ ను తగ్గించుకుంటున్నారు.

"""/"/ శర్వానంద్ సినిమాలు( Sharwanand Movies ) ఫ్లాప్ అయ్యి ఉండవచ్చు కానీ శర్వానంద్ మాత్రం నటుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదని ఆయన ఫ్యాన్స్ భావిస్తారు.

సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుని దర్శకుల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తే శర్వానంద్ కు పూర్వ వైభవం రావడం కష్టమేం కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు.

శర్వా భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది.

వైరల్ అవుతున్న క్లీంకార లేటెస్ట్ ఫోటోలు.. ఎంత ముద్దుగా ఉందో అంటూ?