ఇదేం సంస్కృతి.. ? రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ 

గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )స్పందించారు.

ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి ,  గాంధీ( Kaushik Reddy, Gandhi ) మధ్య తలెత్తిన వివాదం నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్లిన కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డి పైన తనదైన శైలిలో విమర్శలతో విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే దాడులు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ( Revanth Reddy )పై మండిపడ్డారు.

దౌర్భాగ్య సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు.ఫిరాయింపు ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలను ఎదుర్కోవాలని కెసిఆర్ సవాల్ చేశారు.

"""/" / " పదేళ్ల తెలంగాణలో ఇలాంటి హింస్తత్మక ఘటనలు ఎప్పుడు చూడలేదు.

మా పదేళ్ల పాలనలో ఎప్పుడూ అలాంటివి లేవు.ఇప్పుడు హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రాంతీయవాదాన్ని తెచ్చి హింసను రేపుతున్నారు.

  హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయలేదు.ముఖ్యమంత్రి 22 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు .

ఒక ఎమ్మెల్యే ఇంటికి గూండాలను పోలీసుల ఎస్కార్ట్ గా ఇచ్చి పంపారు .

ఎంత దౌర్భాగ్య సీఎం ని ఎక్కడా చూడలేదు.వంద రోజుల్లో గ్యారెంటీ హామీలను అమలు చేస్తానన్న సన్నాసి ఎక్కడ అని ప్రశ్నిస్తే మాపై దాడులకు దిగుతున్నారు '' హైదరాబాద్ ప్రజలు తనకు ఓటు వేయలేదని రేవంత్ రెడ్డి ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని,  హైదరాబాద్ లో ఉన్న ప్రజలంతా మావాళ్లే .

బీఆర్ఎస్ ఎప్పుడు ప్రాంతీయతత్వం పై దాడి చేయలేదు.కౌశిక్ రెడ్డి పై అరికేపూడి గాంధీ( Arikepudi Gandhi ) నోటికొచ్చినట్లు తిట్టడం ఏం సంస్కృతి.

  పనికిమాలిన ముఖ్య మంత్రులు చాలా మంది వచ్చారు.  పెద్దపెద్ద వారితో తలపడ్డాం .

రేవంత్ రెడ్డి బుల్లోడు ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదు.గాంధీ ఇప్పటికీ బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పడం కామెడీ అని కేటీఆర్ అన్నారు.

"""/" /  కౌశిక్ రెడ్డి తప్పేమీ ఉందని ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారిపై చర్యలు తీసుకోవాలి అని అన్నారు .

నాలుగు వారాలు చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పింది.దమ్ముంటే రాజీనామా చేయమని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.

  ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం అన్నారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను తాళ్లతో కొట్టి చంపాలని , ఉరితీయాలని ఇదివరకు రేవంత్ రెడ్డి అన్నారు.

పార్టీ మారీ కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీకి పిఎసి చైర్మన్ ఇవ్వడం ఏమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రపంచంలోనే ప్రమాదకరమైన పాముని ఆస్పత్రికి తీసుకెళ్లిన వ్యక్తి.. మ్యాటరేంటంటే?