నల్ల మచ్చలతో టెన్షన్ వద్దు.. ఈ క్రీమ్ ను వాడితే క్లియర్ స్కిన్ మీ సొంతం!
TeluguStop.com
మొటిమలు, పిగ్మెంటేషన్, వయసు పైబడటం తదితర కారణాల వల్ల ముఖ చర్మం పై నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి.
ఈ నల్ల మచ్చలు అందాన్ని తగ్గించడమే కాదు తమలోని మనో ధైర్యాన్ని సైతం దెబ్బ తీస్తాయి.
ఈ క్రమంలోనే నల్ల మచ్చలను వదిలించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే నల్ల మచ్చలతో టెన్షన్ వద్దు.
ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ ను కనుక వాడితే క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం నల్ల మచ్చలను మటుమాయం చేసే ఆ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందు రెండు నిమ్మ పండ్లు తీసుకుని నీటిలో వేసి శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో కడిగి పెట్టుకున్న నిమ్మ పండ్లను వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
ఆపై ఉడికించిన నిమ్మ పండ్లు మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.
అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్లు తయారు చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన క్రీమ్ సిద్ధమవుతుంది.
"""/"/
ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను అప్లై చేసుకోవాలి.
రోజుకు రెండుసార్లు ఈ క్రీమ్ ను కనుక వాడితే ముఖం పై నల్ల మచ్చలు క్రమంగా మాయమవుతాయి.
క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.మరియు ఈ క్రీమ్ ను వాడటం వల్ల చర్మం స్మూత్ గా సైతం మారుతుంది.
గోపీచంద్ పరిస్థితి ఏంటి..? ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నాడు…