జనసేన ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గం ఇదేనట ?

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు పై జనసేన చాలా ధీమా గానే ఉంది.

గతంతో పోలిస్తే తమ పార్టీ క్షేత్రస్థాయిలో బాగా బలం పుంజుకుంది అనే విషయాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బలంగా నమ్ముతున్నారు.

ప్రస్తుత వైసిపి ప్రభుత్వం పై జనాల్లో వ్యతిరేకత పెరిగిందని, బిజెపి సహకారంతో తాను రాబోయే ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతానని పవన్ భావిస్తున్నారు.

దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఏ ఏ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ? జనసేన గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఎలా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా పవన్ నివేదికలు తెప్పించుకుంటున్నారు.

దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  2019 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం లో మాత్రమే జనసేనకు గెలుపు దక్కడం చాలా అవమానమే మిగిల్చింది.

స్వయంగా పార్టీ అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి చెందారు.

అయితే ఈసారి తమకు మంచి పట్టు ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే 175 నియోజకవర్గాల్లోనూ కచ్చితంగా జనసేన గెలిచే నియోజకవర్గంగా తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం పేరు ఇప్పుడు పార్టీలో మారుమోగుతోంది.

  ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా గెలుపు పక్క అనే లెక్కలు తెరపైకి వచ్చాయి.

"""/"/ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో 1,86,682 మంది ఓటర్లు ఉండగా, దీంట్లో 75% కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే ఉండడంతో అది తమకు కలిసి వస్తుందని జనసేన లెక్కలు వేసుకుంటుంది.

2019 ఎన్నికల్లో జనసేన ప్రభావం పెద్దగా పనిచేయలేదని, వైసిపి గాలి రాష్ట్రమంతా వీయడంతోనే జనసేన కు అక్కడ గెలుపు దక్కలేదు అనే విషయాన్ని జనసేన ఇప్పుడు చెబుతోంది.

  """/"/ జనసేన బలం మరింతగా పెరగడంతో ఈ నియోజకవర్గ టికెట్ కోసం ఆ పార్టీలో గట్టి పోటీ నెలకొంది.

ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామని జనసేన లో టిక్కెట్ ఆశిస్తున్న నేతలంతా ఉన్నారు.

దీంతో పాటు ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలపై పవన్ పూర్తిగా ఫోకస్ పెట్టారు.ఇక్కడ వీలైనంత ఎక్కువ సీట్లు సంపాదిస్తేనే తాను కింగ్ మేకర్ అవుతానని భావిస్తున్నారు.

రాబోయే రోజుల్లో టిడిపి బిజెపిలో పొత్తులో భాగంగా కొన్ని స్థానాలను వదులుకోవాల్సి ఉన్నా, పిఠాపురం మాత్రం జనసేన అభ్యర్థిని పోటీకి దించాలని భావిస్తున్నారట.

దీంతో ఇక్కడ టికెట్ ఆశిస్తున్న నాయకుల సంఖ్య రోజు రోజు కు పెరుగుతోంది.

ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వైసిపి కి చెందిన పెండం దొరబాబు ఉన్నారు.

   .

కళ్ళ చుట్టూ నల్లటి వలయాలా.. క్యారెట్ తో చెక్ పెట్టండిలా!