పవన్ కళ్యాణ్ చేసిన గోకులం లో సీత సినిమాకి,వెంకటేష్ చేసిన మరో సినిమాకి మధ్య పోలిక ఇదే…
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎందుకంటే ఈయన్ చేసిన సినిమాలు ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ లు అందుకోవడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి.
ఇక ఇప్పటికి కూడా తనదైన రీతిలో వరుస సినిమాలు చేఇస్తు అలాగే రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
"""/" /
ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ముత్యాల సుబ్బయ్య( Muthyala Subbaiah ) దర్శకత్వంలో చేసిన గోకులంలో సీత బినిమ సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది.
ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్ వే కొంచెం నెగిటివ్ షెడ్స్ లో ఉంటుంది.
ఇక ఆ క్యారెక్టర్ ఇంటర్వెల్ సమయానికి వచ్చేసరికి మొత్తంగా మారిపోతుంది.ఇక ఇదే క్యారెక్టర్ ని వెంకటేష్ హీరోగా సౌందర్య హీరోయిన్ గా వచ్చిన పవిత్ర బంధం సినిమా( Pavitra Bandham )లో కాపీ చేశారు.
ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఫస్ట్ ఆఫ్ దాకా నెగటివ్ గా కనిపిస్తూ సెకండ్ హాఫ్ లో పాజిటివ్ గా మారిపోతాడు.
ఇక ఈ సినిమాకి ముత్యాల సుబ్బయ్య గారే దర్శకుడు కావడం విశేషం.అయితే ఈ రెండు సినిమాలకు ఈయనే దర్శకుడు కావడం వల్ల ఇలాంటి ఒకే క్యారెక్టర్ తో రెండు సినిమాలను నడిపించినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.
"""/" /
ఇక మొత్తానికైతే ఈ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లు అవ్వడం విశేషం.
ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో కామెడీ ఎంటర్ టైనర్ ను రూపొందిస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ అయితే వరుసగా సినిమాలు చేస్తున్నాడు.అలాగే రాజకీయాల్లో కూడా చాలా బిజీగా కొనసాగుతున్నాడు.
ఇక ఇప్పుడు ఏపి లో జరిగే ఎలక్షన్లలో తను కీలక పాత్ర వహించబోతున్నట్లుగా తెలుస్తుంది.
వీడియో: వేగంగా వెళ్తూ బైక్ పైనుంచి కింద పడ్డ అమ్మాయి.. గాయాలు చూస్తే!!