ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ అంటూ వచ్చేసిన క్లారిటీ.. ఆ రేంజ్ లో నట విశ్వరూపం చూపిస్తారా?
TeluguStop.com
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ ( Junior NTR, Koratala Siva )కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర సినిమా విడుదలకు సరిగ్గా నెలరోజుల సమయం మాత్రమే ఉంది.
ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదలైంది.
జూనియర్ ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్ లో ఉన్న ఆ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
తారక్ రెగ్యులర్ లుక్ లో, రింగుల జుట్టులో వేర్వేరు పాత్రల్లో ఈ సినిమాలో కనిపించనున్నారు.
సాధారణంగా తారక్ ఒక పాత్రలో నటిస్తేనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తారు.
తారక్ డ్యూయల్ రోల్ ( Tarak Dual Role )లో నటిస్తే మాత్రం తారక్ నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు మరోసారి వెండితెరపై చూసే అవకాశం ఉంటుంది.
ఈ మధ్యకాలంలో తారక్ డ్యూయల్ రోల్ లో నటించిన సందర్భాలు సైతం తక్కువేననే సంగతి తెలిసిందే.
"""/" /
దేవర సినిమాలో తారక్ తండ్రి కొడుకులుగా కనిపించనున్నారని తెలుస్తోంది.ఒక పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో రివిల్ అవుతుందని సమాచారం అందుతోంది.
పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ ( Periodic Back Drop )లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి.
ఈ సినిమాలో జాన్వి కపూర్ లుక్స్ కు సైతం మంచి మార్కులు పడ్డాయి.
త్వరలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
"""/" /
దేవర ట్రైలర్ సెప్టెంబర్ రెండవ వారంలో విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
దేవర సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ సినిమా నిలిచే ఛాన్స్ ఉందని బోగట్టా.
ఈ సినిమా విషయంలో కొరటాల శివ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని సమాచారం అందుతుంది.
దేవర సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రైలులో చోటులేదనేమో.. 290 కి.మీ. ఏకంగా రైలు కోచ్ కింద ప్రయాణించిన వ్యక్తి