ఇదేం సెలెబ్రేషన్స్ రా బాబు.. బర్త్డే సెలబ్రేషన్స్‌లో యువకుడి జననాంగాలకు ఏకంగా.?
TeluguStop.com
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి యువత చేయరాని పనులు చేస్తున్నారు.
వారు చేసే పనులు ప్రాణాల మీదికి వస్తాయో లేవోన్న విషయం మరిచిపోయి ఇష్టానుసారం ప్రవర్తించడం పరిపాటిగా మారిపోయింది.
ఇందులో భాగంగా కొందరు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు, అలాగే రైలు ప్రయాణం( Train Journey ) చేసే సమయంలో కూడా స్టెంట్స్ చేస్తూ ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు చాలానే చూసాము.
ఇకపోతే తాజాగా కొందరు తన స్నేహితుని పుట్టినరోజు వేడుకగా చేసిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే. """/" /
స్నేహితుల పుట్టినరోజు పేరిట కొందరు చేస్తున్న అల్లరి పనుల వల్ల ప్రాణాల మీదకు వస్తున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
ఇదే కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కొంతమంది స్నేహితులు పుట్టినరోజు సందర్భంగా అతని ప్రైవేట్ పార్ట్ పై నిప్పంటించడం వీడియోలో కనపడుతుంది.
"ఘర్ కే కాలేష్"( Ghar Ke Kalesh ) అనే ట్విత్త్వే ఖాతాలో ఈ వీడియోని పోస్ట్ చేయగా.
ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.పుట్టినరోజు జరుపుకుంటున్న యువకుడు గదిలో ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో అతని వద్దకి తన స్నేహితులు చేరుతారు.
ఆ తర్వాత తమతో పాటు తీసుకువచ్చిన ఓ లిక్విడ్ ను నిద్రపోతున్న అతడి స్నేహితుడిపై పోసి ఆ తర్వాత నిప్పు అంటించారు.
ఆ తర్వాత హ్యాపీ బర్త్డే అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. """/" /
దాంతో వెంటనే ఉలిక్కిపడిన ఆ యువకుడు ఒక్కసారిగా నిప్పును ఆర్పి వేసి వారిని కొట్టడానికి వెళ్లేందుకు ప్రయత్నం చేయడం వీడియోలో కనబడుతుంది.
అయితే ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఈ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.ఇలాంటి స్నేహితులు లేకపోయినా పరవాలేదు అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.
ఈ మధ్యకాలంలో కొందరు యువకులు ఇష్టానుసారం ప్రవర్తించడం పరిపాటిగా మారినట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోని ఒకసారి వీక్షించండి.
డబ్బు కోసం కట్టుకున్న భర్తనే కిడ్నాప్.. దక్షిణాఫ్రికాలో భారత సంతతి మహిళ ఘాతుకం