అడ్డంగా బుక్కైపోయిన విజయ్ దేవరకొండ.. రిజల్ట్ తెలిసే పూరీ అలా చేశారా?

స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో వరుసగా రెండు సినిమాలను తెరకెక్కిస్తానని ప్రకటించిన సమయంలో విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో సంతోషించారు.

అయితే ఆ సంతోషం ఆవిరి కావడానికి ఎంతో సమయం పట్టలేదు.లైగర్ సినిమా విజయ్ దేవరకొండ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.

ఈ సినిమా వల్ల భారీ మొత్తంలో నష్టాలు తప్పవని తేలిపోయింది.అయితే లైగర్ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నా విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

జనగణమన సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి కావడంతో ఈ సినిమాను ఆపడం కష్టమేనని తెలుస్తోంది.

వీలైనంత తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించి లైగర్ సినిమాతో నష్టపోయిన బయ్యర్లకు తక్కువ రేట్లకు సినిమా హక్కులను ఇస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

విజయ్ దేవరకొండకు పూరీ జగన్నాథ్ మరో ఫ్లాప్ ఇస్తే మాత్రం ఈ హీరో కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/"/ విజయ్ దేవరకొండ జనగణమన ప్రాజెక్ట్ కు నో చెప్పాలని మరి కొందరు సూచిస్తున్నారు.

లైగర్ ఫ్లాప్ పై విజయ్ దేవరకొండ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ కెరీర్ లో సినిమాలు ఫ్లాప్ కావడం తొలిసారి కాదు. """/"/ అయితే విజయ్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటే ఈ స్థాయిలో నెగిటివిటీ స్ప్రెడ్ కావడం మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ కూడా ఇందుకు ఒక విధంగా కారణమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు పూరీ జగన్నాథ్ వాట్సాప్ యాప్ ను డిలీట్ చేశారని తెలుస్తోంది.లైగర్ రిజల్ట్ తెలిసే పూరీ విజయ్ తో మరో మూవీ షూట్ మొదలుపెట్టారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Mummys Gold Review: How Mummys Gold Works And What Canadian Players Should Know