సీనియర్ నరేష్ నాలుగో పెళ్లికి సమస్య ఇదే.. ఆ రీజన్ వల్లే ఆగారంటూ?
TeluguStop.com
గత కొన్ని రోజులుగా సీనియర్ నరేష్ పవిత్రా లోకేశ్ పెళ్లికి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
సీనియర్ నరేష్ ఈ వార్తల గురించి స్పందించినా ఆయన స్పందించిన తీరు ప్రేక్షకులను మరింత కన్ఫ్యూజన్ కు గురి చేసింది.
వీళ్లిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటారో లేదోనని అభిమానులలో సైతం ఒకింత కన్ఫ్యూజన్ నెలకొంది.
అయితే వీళ్లిద్దరి పెళ్లి ఆలస్యం కావడానికి ఇతర కారణాలు ఉన్నాయని సమాచారం.పవిత్ర లోకేశ్ తన భర్త నుంచి విడాకులు కోరిందని అయితే కోర్టు నుంచి విడాకులు మంజూరు కావాల్సి ఉందని ఇప్పటికే తెలిసిందే.
అయితే సీనియర్ నరేష్ కు కూడా మూడో భార్య నుంచి విడాకులు రాలేదని సీనియర్ నరేష్ పవిత్ర లోకేశ్ పెళ్లికి సమస్య ఇదేనని సమాచారం.
విడాకులు మంజూరయ్యే వరకు పెళ్లిని వాయిదా వేసుకోవడం మినహా సీనియర్ నరేష్ కు మరో ఆప్షన్ అయితే లేదనే సంగతి తెలిసిందే.
ఆలస్యమైనా రాబోయే రోజుల్లో వీళ్లిద్దరి పెళ్లి జరగడం గ్యారంటీ అని బోగట్టా. """/"/ అటు నరేష్ ఇటు పవిత్ర లోకేశ్ ప్రస్తుతం ఆఫర్లతో బిజీగా ఉండగా పలు సినిమాలలో వీళ్లిద్దరూ కలిసి నటించారు.
సినిమాల షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని ఆ పరిచయం ప్రేమగా మారి ప్రస్తుతం పెళ్లి వరకు వచ్చిందని తెలుస్తోంది.
పవిత్రా లోకేశ్ మాత్రం వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించడానికి ఇష్టపడటం లేదు.
"""/"/
ఈ వార్తల గురించి స్పందిస్తే మరిన్ని ప్రశ్నలు ఎదురయ్యే అవకాశంతో పాటు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది.
అయితే పవిత్రా లోకేశ్ ఈ వార్తల గురించి స్పందించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
పవిత్రా లోకేశ్ సైలెన్స్ అభిమానులను మరింత టెన్షన్ పెడుతుండటం గమనార్హం.