నాగార్జున, అల్లు అరవింద్ చేసిన పెద్ద తప్పు ఇదే.. రూ.కోట్లు నష్టపోయారంటూ?

స్టార్ హీరో నాగార్జున ఒకవైపు నటుడిగా మరోవైపు నిర్మాతగా పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.

స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వరుసగా సినిమాలను నిర్మిస్తూ, పలు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

ఈ నెలలో అల్లు అరవింద్ కాంతార సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయగా నాగార్జున కార్తీ హీరోగా నటించిన సర్దార్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు.

అయితే నాగార్జున, అల్లు అరవింద్ ఒక తప్పు చేయడంతో ఆ తప్పు వల్ల ఇద్దరూ కోట్ల రూపాయలు నష్టపోతున్నారు.

ఈ రెండు సినిమాలను పర్సంటేజ్ విధానంలో నాగ్, అల్లు అరవింద్ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు.

మొదట అవుట్ రేట్ కు కొనే అవకాశం వచ్చినా రిస్క్ అని భావించి అల్లు అరవింద్, నాగ్ చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు.

ఒకవేళ ఈ సినిమాలను సొంతంగా రిలీజ్ చేసి ఉంటే వాళ్లిద్దరికీ ఊహించని స్థాయిలో లాభాలు వచ్చేవి.

కాంతార సినిమాతో అల్లు అరవింద్ గతంలో ఏ సినిమాకు సాధించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకుని ఉండేవారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అల్లు అరవింద్ కాంతార సినిమా రిజల్ట్ ను ముందే అంచనా వేసి ఉంటే ఈ తప్పు జరిగేది కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాంతార మూవీ తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 30 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది.

"""/"/ స్ట్రెయిట్ సినిమాలను మించి ఈ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

సర్దార్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కాగా ఈ సినిమా పరిమితంగా లాభాలను సొంతం చేసుకోవడం గమనార్హం.

కాంతార సక్సెస్ నేపథ్యంలో అల్లు అరవింద్ ఇతర భాషల సినిమాలపై దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది.

నిజం చెబితే చస్తారు…ఆ భాద మీకు తెలియదు పూనమ్ సంచలన వ్యాఖ్యలు!