ఈగ మూవీ ఇప్పుడు రిలీజై ఉంటే వందల కోట్లు వచ్చేవా.. అదే తప్పు అంటూ?
TeluguStop.com
రాజమౌళి సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఈగ మూవీ ఒకటనే సంగతి తెలిసిందే.
తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ సినిమా 2012 సంవత్సరంలో విడుదలై కమర్షియల్ గా సక్సెస్ సాధించింది.
అయితే రాజమౌళి ఈ సినిమా కోసం పడిన కష్టంతో పోల్చి చూస్తే ఆ రేంజ్ కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకోలేదు.
అప్పట్లో రాజమౌళి హిందీలో ఈ సినిమాను విడుదల చేయగా అక్కడ ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు.
రాజమౌళికి ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు ఉంది.రాజమౌళి ప్రమోషన్స్ చేసిన ఇతర హీరోల సినిమాలు సైతం సక్సెస్ సాధిస్తున్నాయంటే ఆయన ఏ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్నారో సులువుగా అర్థమవుతుంది.
ఈగ సినిమా సక్సెస్ సాధించినా ఆ సినిమా రేంజ్ కు తగిన సక్సెస్ అప్పట్లో దక్కలేదు.
ఈగ సినిమా తాజాగా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శించబడగా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమాకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.
"""/"/
మరోవైపు రాజమౌళి మహేష్ సినిమాకు సంబంధించి అంచనాలను అంతకంతకూ పెంచుతున్నారు.గత సినిమాలను మించి ఈ సినిమా ఉండే విధంగా రాజమౌళి అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు.
రాజమౌళి ఈ సినిమాలోని నటీనటుల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
రాజమౌళి రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోంది.కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న రాజమౌళి ప్రస్తుతం ఊహించని రేంజ్ లో సంపాదిస్తున్నారు.
రాజమౌళి తను సంపాదించిన డబ్బులో కొంత మొత్తాన్ని దానం చేస్తున్నా ఆ సహాయాల గురించి చెప్పుకోవడానికి కూడా జక్కన్న ఇష్టపడటం లేదు.
సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోవడం అప్పట్లో ఈగ సినిమాకు ఒకింత మైనస్ అయింది.
సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ ల పరిస్థితి ఏంటి..?