బలాన్ని మరవడమే వెంకటేశ్ కు శాపంగా మారిందా.. సైంధవ్ ఫ్లాప్ కావడానికి కారణాలివేనా?

ఒక్కో హీరోకు ఒక్కో బలం ఉంటుంది.కథల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సరైన కథలను ఎంచుకుంటే మాత్రమే విజయాలు సొంతమవుతాయి.

వెంకటేశ్ సైంధవ్ సినిమాకు ( Saindhav Movie ) పాజిటివ్ టాక్, పాజిటివ్ రివ్యూలు వచ్చినా ఈ సినిమా కలెక్షన్లు మాత్రం నిరాశపరిచేలా ఉండటం గమనార్హం.

వెంకటేశ్ కు( Venkatesh ) ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది.ఆ గుర్తింపు వల్లే దృశ్యం, ఎఫ్2, ఎఫ్3 సినిమాలు సక్సెస్ అయ్యాయి.

"""/" / ఫ్యామిలీ ప్రేక్షకుల్లో( Family Audience ) వెంకీకి ఊహించని స్థాయిలో బలం ఉంది.

ఫ్యామిలీ కథలను ఎంచుకుంటే వెంకటేశ్ సినిమాలకు మినిమం గ్యారంటీ కలెక్షన్లు వస్తాయి.సైంధవ్ కథ అలాంటి కథ కాకపోవడం వెంకీకి మైనస్ అయింది.

వెంకీ 75వ సినిమా అంటే ప్రేక్షకులకు ఆ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే సైంధవ్ మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిలైంది. """/" / హిట్, హిట్2 సినిమాలతో సక్సెస్ లను సొంతం చేసుకున్న శైలేష్ కొలను( Sailesh Kolanu ) ఆ సినిమాలలా సైంధవ్ సినిమాకు బలమైన స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఫెయిలయ్యారు.

సరైన ప్రమోషన్స్ లేకపోవడం, సోలోగా రిలీజ్ కాకపోవడం, ఆశించిన రేంజ్ లో థియేటర్లు దొరకకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అయిందనే చెప్పాలి.

ఎంచుకునే సినిమాల విషయంలో వెంకటేశ్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. """/" / వెంకటేశ్ తర్వాత సినిమాలకు సంబంధించి కథల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.

వెంకీ, నాని హీరోలుగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

వెంకటేశ్ కు రాబోయే రోజుల్లో భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమా సినిమాకు వెంకటేశ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

పది నిమిషాల్లో తలనొప్పి నుంచి రిలీఫ్ పొందాలంటే ఇలా చేయండి!