వామ్మో.. ఇదేందయ్యా ఇంతుంది.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదేనట(వీడియో)

సాధారణంగా మనలో చాలామంది కి పాములన్న, కొండచిలువలన్న ఇలా పాము జాతికి సంబంధించి విపరీతమైన భయం ఉంటుంది.

అవి ఒక ప్రాంతంలో ఉన్నాయంటే.మనం ఆ ప్రాంతానికి వెళ్లకుండా అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటాము.

అయితే ప్రస్తుత రోజులలో చాలావరకు వివిధ రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

అచ్చం ఆ లిస్టులోకి తాజాగా ఒక యువకుడు భారీగా ఉన్న కొండచిలువను ( Anaconda)భుజాలపై ఎత్తుకున్నాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది. """/" / వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా అతని పేరు మైక్ హోల్ స్టైల్.

వాస్తవానికి ఇతడు ఒక జూ కీపర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు.

ప్రాణాంతకరమైన కొండచిలువలను ( Anaconda)ఇలా మెడకు గట్టిగా చుట్టుకోవడం చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

వీడియోలో అతను పాము గురించి వివరించడం మనం చూడవచ్చు.ఏ మాత్రం పొరపాటు జరిగినా కానీ ఆ యువకుడు ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి అని కొందరు కామెంట్ చేస్తూ ఉన్నారు.

ఇక మరికొందరు అయితే, నీకు చాలా ధైర్యం బాస్ అని కామెంట్ చేస్తున్నారు.

నిజానికి ఇలాంటి వీడియోలు ఇది వరకు కూడా అనేకం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇలాంటి పెద్ద పాములను విదేశీయులు ఒకే ప్రాంతంలో పెద్దతున్న పెంచుతూ ఉంటారు కూడా.

మరి కొందరైతే వీటితో అనేక వ్యాపారాలను కూడా చేస్తుంటారు.వీటితో ప్రమాదం పొంచి ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి భయానకరమైన పాములను సాధు జంతువుల లాగా పెంచుకుంటున్నారు.

ఆ ఆలయంలో సాయిపల్లవి న్యూ ఇయర్ వేడుకలు.. అక్కడ జరుపుకోవడానికి కారణాలివే!