మోకాళ్ళ నొప్పులతో బాగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే కచ్చితంగా ఇది తెలుసుకోండి!

ప్ర‌స్తుత రోజుల్లో వయసు పైబడిన వారే కాదు.ముప్పై ఏళ్ల వారు సైతం మోకాళ్ళ నొప్పులతో( Knee Pains ) తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

మోకాళ్ళ నొప్పులు కారణంగా నిలబడడానికి, నడవడానికి చాలా భారంగా అనిపిస్తుంది.ఎక్కువ సమయం పాటు ఏ పని చేయలేకపోతుంటారు.

ఇక మెట్లు ఎక్కాలంటే గగనం అయిపోతుంటుంది.మీరు కూడా మోకాళ్ళ నొప్పులతో బాగా ఇబ్బంది పడుతున్నారా.

? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే పొడిని మీరు తీసుకోవాల్సిందే.ఈ పొడి మోకాళ్ళ నొప్పుల నుండి విముక్తి పొందడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.ఏ విధంగా వాడాలి.

అన్నది తెలుసుకుందాం ప‌దండి. """/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు బాదం వేసి వేయించుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు పిస్తా పప్పు, రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు కూడా వేసి వేయించుకొని పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బాదంపప్పు( Almonds ), జీడిపప్పు, పిస్తా పప్పు, గసగసాలు వేసుకోవాలి.

అలాగే ఐదు నుంచి ఆరు యాలకులు, పావు టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు, పావు టేబుల్ స్పూన్ జాజికాయ పొడి వేసుకొని మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ పౌడ‌ర్ లో ఎముక‌ల ఆరోగ్యానికి అవ‌స‌రం అయ్యే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ప్రోటీన్‌, విట‌మిన్ కె( Vitamin K ) వంటి పోష‌కాలు పుష్క‌లంగా నిండి ఉంటాయి.

రోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ను వన్ టేబుల్ స్పూన్ చొప్పున కలిపి తీసుకోవాలి.

"""/" / ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తే ఎముకల సాంద్రత( Bone Density ) పెరుగుతుంది.

బలహీనమైన ఎముకలు దృఢంగా, గట్టిగా మారతాయి.దీంతో మోకాళ్ళ నొప్పులు దెబ్బకు పరార్ అవుతాయి.

మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడడానికి ఈ పౌడ‌ర్ చాలా ఎఫెక్టివ్‌ గా పని చేస్తుంది పైగా ఈ పొడిని రోజు తీసుకుంటే ప్రోటీన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది.

అతి ఆకలి దూరం అవుతుంది.మెదడు మునుపటి కంటే చురుగ్గా సైతం పనిచేస్తుంది.

కేరళను కుదిపేసిన కారులో హీరోయిన్ పై లైంగిక దాడి…. ఎన్నెళ్ళయిన దొరకని న్యాయం