హెయిర్ ఫాల్ ను సూపర్ ఫాస్ట్ గా స్టాప్ చేసే బెస్ట్ టానిక్ ఇది.. తప్పక ట్రై చేయండి!

జుట్టు విపరీతంగా రాలిపోతుందా.? కురులు రోజురోజుకు పల్చగా మారుతున్నాయా.

? జుట్టు రాలడాన్ని( Hair Fall ) ఎలా అడ్డుకోవాలో అంతు చిక్కడం లేదా.

? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.నిజానికి కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు హెయిర్ ఫాల్ ను రెడ్యూస్ చేయడంలో చాలా ఉత్తమంగా సహాయ పడతాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ టానిక్ ను కనుక వాడితే హెయిర్ ఫాల్ సూపర్ ఫాస్ట్ గా స్టాప్ అవుతుంది.

మరి ఇంతకీ ఆ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి మెంతులు నానబెట్టుకున్న గిన్నెను పెట్టి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై మెంతుల వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.మరోవైపు ఒక కలబంద ఆకుని( Aloevera ) తీసుకుని జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జెల్ ను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.

"""/" / ఇప్పుడు ఒక కప్పు అలోవెరా జ్యూస్ కు అర కప్పు మెంతుల వాటర్, మూడు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ అల్లం జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన హెయిర్ టానిక్( Hair Tonic ) అనేది సిద్ధమవుతుంది.

ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

"""/" / వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను వాడితే హెయిర్ ఫాల్ దెబ్బకు కంట్రోల్ అవుతుంది.

జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.కురులు ఆరోగ్యంగా బలంగా మారతాయి.

డ్రై హెయిర్ సమస్య దూరం అవుతుంది.హెయిర్ డ్యామేజ్ అవ్వడం తగ్గుముఖం పడుతుంది.

కాబట్టి జుట్టు విపరీతంగా రాలుతుందని బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హెయిర్ టానిక్ ను తయారు చేసుకొని వాడేందుకు ప్రయత్నించండి.

భారతీయుడు2 డిజాస్టర్ కావడం చరణ్ మూవీకి అలా ప్లస్ అయిందా.. ఏం జరిగిందంటే?