నిద్రలేమితో సతమతం అవుతున్నారా? అయితే ఈ టీ మీ డైట్ లో ఉండాల్సిందే!
TeluguStop.com
నిద్రలేమి.ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పేరు ఇది.
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
ఒత్తిడి, జాబ్ షిఫ్ట్ లు, నిద్రను నిర్లక్ష్యం చేయడం, మొబైల్ ఫోన్ ను అధికంగా చూడడం, పలు రకాల మందుల వాడకం తదితర కారణాల వల్ల నిద్రలేమి సమస్య బారిన పడుతుంటారు.
ఇది చిన్న సమస్యగానే కనిపించిన.నిర్లక్ష్యం చేస్తే ఊబకాయం, మధుమేహం, గుండెపోటు తదితర ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ ను భారీగా పెంచుతుంది.
అందుకే నిద్రలేమిని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే టీ అద్భుతంగా సహాయపడుతుంది.
ఇంతకీ ఆ టీ మరేమిటో కాదు రోజ్ టీ.అవును, ఈ టీ ను తయారు చేసుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే కొన్ని ఎండిన గులాబీ రేకులు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
"""/"/
ఆ తర్వాత మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపితే మన రోజ్ టీ సిద్ధం అవుతుంది.
నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ రోజ్ టీ ను తీసుకుంటే నిద్రలేమి అన్న మాటే అనరు.
ప్రశాంతమైన సుఖమైన నిద్ర మీ సొంతం అవుతుంది.పైగా రోజ్ టీ ను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.
గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.
"""/"/
రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.డిప్రెషన్ నుంచి బయటపడటానికి రోజ్ టీ ఉత్తమైన ఎంపిక.
అలాగే రోజ్ టీను తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.చర్మం ఎల్లప్పుడూ నిగారింపుగా యవ్వనంగా సైతం మెరుస్తుంది.
కాబట్టి నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు మాత్రమే కాదు ఎవ్వరైనా ఈ రోజ్ టీ ను డైట్ లో చేర్చుకోవచ్చు.