వెయిట్ లాస్ కు తోడ్పడే బెస్ట్ స్మూతీ ఇది.. వారానికి 2 సార్లు తీసుకున్న మస్తు లాభాలు!

ఇటీవల బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది.వెయిట్ లాస్ ( Weight Loss )అవ్వాలి అంటే తినడం మానేయడం కాదు.

ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకోవడం.బరువు తగ్గడానికి తోడ్పడే ఆహారాలు ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి.

అందులో డ్రాగన్ బనానా స్మూతీ కూడా ఒకటి.వారానికి క‌నీసం రెండుసార్లు ఈ స్మూతీని తీసుకుంటే వెయిట్ లాస్ తో పాటు మస్తు ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.

స్మూతీ తయారీ కోసం ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ రోల్డ్ ఓట్స్,( Rolled Oats ) ఐదు నైట్ అంతా నానబెట్టి పొట్టు తొలగించిన బాదం గింజలు( Almonds ), ఐదు పిస్తా గింజలు, ఒక కప్పు డ్రాగన్ ఫ్రూట్‌ ముక్కలు( Dragon Fruit Slices ), అరకప్పు అరటిపండు ముక్కలు వేసుకోవాలి.

చివరిగా ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

దాంతో మన డ్రాగన్ బనానా స్మూతీ అనేది సిద్ధమవుతుంది. """/" / ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని కనుక తీసుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.

చిరు తిండ్లపై మనసు మళ్లకుండా చేస్తుంది.ఇది బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.

అలాగే డ్రాగన్ బ‌నానా స్మూతీలో బీటా-కెరోటిన్, పాలీఫెనాల్స్ మరియు విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి వాపు మరియు కణాల నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.దీర్ఘకాలిక వ్యాధులు మరియు అకాల వృద్ధాప్య ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

"""/" / డ్రాగన్ ఫ్రూట్ ఒక ప్రోబయోటిక్ ఆహారం.అందువ‌ల్ల ఇది మీ జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను ప్రోత్స‌హిస్తుంది.

ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు దోహదపడుతుంది.అంతేకాకుండా డ్రాగన్ బ‌నానా స్మూతీలో మెగ్నీషియం మెండుగా ఉంటుంది.

ఇది ఎముకల ఆరోగ్యానికి మ‌ద్ద‌తు ఇస్తుంది.విట‌మిన్ సి రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తుంది.

బ్రేక్ ఫాస్ట్ లో డ్రాగ‌న్ బ‌నానా స్మూతీని యాడ్ చేసుకుంటే చ‌ర్మం కూడా నిగారింపుగా త‌యార‌వుతుంది.

అల్లు అర్జున్ ఒకే సమయంలో రెండు సినిమాలు చేస్తున్నాడా..?