వేసవిలో శరీరాన్ని శక్తివంతంగా మార్చే బెస్ట్ స్మూతీ ఇది.. తప్పకుండా తీసుకోండి!

వేసవి కాలంలో రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటం అంటే మామూలు విషయం కాదు.

ఎండల కారణంగా శరీరంలో నీరు మొత్తం ఆవిరి అయిపోతుంటుంది.అలాగే ఎండల దెబ్బకు నీరసం, అలసట వంటివి పనిగట్టుకుని మరీ వచ్చి మదన పెడుతుంటాయి.

వీటికి దూరంగా ఉండాలంటే ఖ‌చ్చితంగా డైట్ లో కొన్ని కొన్ని ఆహారాలను చేర్చుకోవాల్సిందే.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే స్మూతీని తీసుకుంటే వేసవిలో మీ శరీరం శక్తివంతంగా మారుతుంది.

రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

"""/" / ముందుగా ఒక యాపిల్( Apple ) ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఒక‌ అవకాడో( Avocado )ను తీసుకుని సగానికి కట్ లోపల ఉండే పల్ప్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు మరియు అవకాడో ప‌ల్ప్ వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆల్మండ్ బటర్,( Almond Butter ) మూడు టేబుల్ స్పూన్లు వాటర్ లో అరగంట పాటు నానబెట్టుకున్న ఓట్స్ మరియు ఒక గ్లాసు ఓట్స్ మిల్క్( Oat Milk ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / అంతే మన స్మూతీ సిద్ధం అయినట్టే.ఈ యాపిల్ అవకాడో ఓట్స్ స్మూతీ చాలా టేస్టీగా ఉంటుంది.

అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని తీసుకుంటే నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

బాడీ సూపర్ ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా మారుతుంది. """/" / రోజంతా శక్తివంతంగా ఉండేందుకు ఈ స్మూతీ ఉత్తమంగా సహాయపడుతుంది.

అంతేకాదు ఈ స్మూతీ తీసుకోవడం వల్ల అతి ఆకలి దూరం అవుతుంది.వెయిట్ లాస్ అవుతారు.

గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.

మరియు మెదడు పనితీరు సైతం చురుగ్గా మారుతుంది.కాబట్టి ఈ హెల్తీ స్మూతీని తప్పకుండా డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

అమానుషం.. బైక్ కు కుక్కను కట్టేసి ఏకంగా నడిరోడ్డుపై..?