రక్తహీనతను పోగొట్టడానికి బెస్ట్ స్మూతీ ఇది.. వారానికి 2 సార్లు తీసుకున్న చాలు!
TeluguStop.com
రక్తహీనత( Anemia ) అనేది ఎంతో మందిని అత్యంత సర్వసాధారణంగా వేధిస్తున్న వ్యాధి.
ముఖ్యంగా ఆడవారు, పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతూ ఉంటుంది.రక్తహీనత వల్ల ఎప్పుడు నీరసంగా, బలహీనంగా ఉంటారు.
ఏ పని చేయలేకపోతుంటారు.తరచూ కళ్ళు తిరుగుతూ ఉంటాయి.
ఇలా ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడతాయి.వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే రక్తహీనతను వదిలించుకోవడం చాలా అవసరం.
అయితే రక్తహీనతను పోగొట్టడానికి ఇప్పుడు చెప్పబోయే స్మూతీ చాలా బాగా సహాయపడుతుంది.ఈ స్మూతీని వారానికి రెండు సార్లు తీసుకున్న చాలు బోలెడు లాభాలు పొందుతారు.
"""/" /
స్మూతీ తయారీ కోసం ముందుగా ఒక క్యారెట్ మరియు హాఫ్ యాపిల్ ను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, యాపిల్ ముక్కలు వేసుకోవాలి.
అలాగే మూడు లేదా నాలుగు పాలకూర ఆకులు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, వన్ టేబుల్ స్పూన్ హెంప్ సీడ్స్ మరియు ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
తద్వారా యాపిల్ క్యారెట్ పాలక్ స్మూతీ ( Apple , Carrot , Spinach Smoothie )అనేది రెడీ అవుతుంది.
"""/" /
ఈ స్మూతీలో రుచికి సరిపడా తేనె కలుపుకుని సేవించాలి.వారానికి రెండు సార్లు ఈ స్మూతీని తీసుకుంటే శరీరానికి ఐరన్ తో సహా ఎన్నో ముఖ్యమైన పోషకాలు అందుతాయి.
రక్తహీనత సమస్య దూరం అవుతుంది.నీరసం, బలహీనత పరార్ అవుతాయి.
అలాగే ఈ స్మూతీ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
మధుమేహాన్ని( Diabetes ) అదుపులో ఉంచుతుంది.క్యాన్సర్, గుండెపోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.
మొత్తం ఆరోగ్యాన్ని రక్షించడమే కాకుండా చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపిస్తుంది.జుట్టు రాలటాన్ని సైతం అరికడుతుంది.
ఎన్టీయార్ పాన్ ఇండియా డైరెక్టర్లనే ఎంచుకుంటున్నాడా..? కారణం ఏంటి..?