Smoothie : గుండెపోటు నుంచి మధుమేహం వరకు అనేక జబ్బులకు చెక్ పెట్టే బెస్ట్ స్మూతీ ఇది.. డోంట్ మిస్!
TeluguStop.com
ఇటీవల కాలంలో మధుమేహం, ఊబకాయం, గుండెపోటు, క్యాన్సర్ ఇలా రకరకాల జబ్బులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఎంత సంపద ఉన్నా సరే ఆరోగ్యం సరిగ్గా లేకపోతే మనశ్శాంతి కరువవుతుంది.అందుకే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
పోషకాహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి.ఇకపోతే కొన్ని కొన్ని స్మూతీలు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి.
అటువంటి వాటిల్లో ఇప్పుడు చెప్పబోయే స్మూతీ( Smoothie ) కూడా ఒకటి.ఈ స్మూతీ గుండెపోటు నుంచి మధుమేహం వరకు అనేక జబ్బులకు చెక్ పెట్టగలదు.
మరింతకీ ఆ స్మూతీ ఏంటి.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.
? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక కప్పు కర్బూజ ముక్కలు( Muskmelon ) కట్ చేసి పెట్టుకోవాలి.
అలాగే ఒక కప్పు పీల్ తొలగించి తరిగిన కీరా ముక్కలు( Cucumber ) పెట్టుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కర్బూజ ముక్కలు, కీర దోసకాయ ముక్కలు వేసుకోవాలి.
అలాగే అరకప్పు ఫ్రెష్ లేత మునగాకు,( Moringa ) రెండు టేబుల్ స్పూన్ల తేనె మరియు ఒక కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తద్వారా మన స్మూతీ సిద్ధమవుతుంది.ఈ కర్పూజ కీరా మునగాకు స్మూతీ రుచి పరంగా చాలా బాగుంటుంది.
"""/" /
అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.వారానికి కనీసం రెండుసార్లు ఈ స్మూతీని కనుక తీసుకుంటే దానిలో ఉండే పోషకాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె సంబంధిత జబ్బులు( Heart Diseases ) వచ్చే రిస్క్‌ను తగ్గిస్తాయి.
ఈ స్మూతీలో పుష్కలంగా ఉండే విటమిన్ ఎ కంటి చూపును పెంచుతుంది.విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది.
"""/" /
అంతేకాదు ఈ రుచికరమైన స్మూతీ మధుమేహం,( Diabetes ) క్యాన్సర్,( Cancer ) ఊబకాయం( Obesity ) వంటి జబ్బుల బారిన పడే అవకాశాలను తగ్గిస్తుంది.
నిద్రలేమి సమస్యకు చెక్ పెడుతుంది.బాడీలో పెరిగిపోయిన మలినాలను బయటకు పంపుతుంది.
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.మరియు ఈ స్మూతీలో యాంటీ అల్సర్ లక్షణాలు కూడా ఉంటాయి.
అందువల్ల దీన్ని తీసుకుంటే అల్సర్ సమస్యను సైతం నయం చేసుకోవచ్చు.
బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేయడం పుష్ప2 కు సాధ్యమేనా.. బన్నీ రేంజ్ డిసైడ్ కానుందా?