లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ను అందించే బెస్ట్ రెమెడీ ఇది.. తప్పక ట్రై చేయండి!

అందాన్ని పెంచే వాటిలో కురులు ఒకటి.అందుకే చర్మం తో పాటు జుట్టు( Hair ) సంరక్షణకు కూడా చాలా అవసరం.

లేదంటే రకరకాల జుట్టు సమస్యలు వేధిస్తుంటాయి.అయితే మనలో చాలా మంది లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ( Long And Strong Hair )కోసం ఆరాటపడుతుంటారు.

కానీ అటువంటి జుట్టును పొందడం ఎలాగో తెలియక మదన పడుతుంటారు.మీరు ఈ లిస్టులో ఉన్నారా.

‌.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు తప్పక ట్రై చేయాల్సిందే.

ఈ రెమెడీతో సులభంగా లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ను పొందవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

"""/" / ముందుగా ఒక చిన్న ఉల్లిపాయ ( Onion )ని తీసుకుని తొక్క తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెండు రెబ్బలు కరివేపాకు, ( Curry Leaves )వన్ టేబుల్ స్పూన్ మెంతులు ( Fenugreek )మరియు అరకప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

"""/" / ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( Coconut Oil) వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు దూది సహాయంతో ఈ జ్యూస్ ను స్కాల్ప్ కు బాగా అప్లై చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేస్తే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.

దాంతో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

లాంగ్ అండ్ థిక్ హెయిర్ మీ సొంతం అవుతుంది.పైగా చుండ్రు సమస్యతో బాధపడే వారికి కూడా ఈ రెమెడీ సహాయపడుతుంది.

బాలీవుడ్ హీరోలకంటే తెలుగు హీరోలే ముద్దు అంటున్న సందీప్ రెడ్డి వంగ…