వర్షాకాలంలో వెంట్రుకల బలానికి బెస్ట్ రెమెడీ ఇది.. వారానికి ఒక్కసారి పాటిస్తే మస్తు బెనిఫిట్స్!
TeluguStop.com
వర్షాకాలంలో సహజంగానే వెంట్రుకలు( Hair ) బలహీనంగా మారుతుంటాయి.దీని కారణంగా హెయిర్ ఫాల్ అనేది తీవ్రంగా తయారవుతుంది.
దాంతో తెగ హైరానా పడిపోతుంటారు.అయితే టెన్షన్ వద్దు.
వర్షాకాలంలో వెంట్రుకల బలానికి బెస్ట్ రెమెడీ ఒకటి ఉంది.వారానికి ఒక్కసారి దాన్ని పాటిస్తే మీ వెంట్రుకలు బలంగా మారడమే కాదు మరెన్నో బెనిఫిట్స్ లభిస్తాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు గ్రీన్ టీ ఆకులు( Green Tea Leaves ) వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై గ్రీన్ టీను ఫిల్టర్ చేసుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మందారం పౌడర్, వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ వేసుకోవాలి.
"""/" /
అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు( Curd ), వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె( Sesame Oil ) మరియు సరిపడా గ్రీన్ టీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
"""/" /
వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు కుదుళ్లు దృఢంగా మారతాయి.
దాంతో హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.అలాగే ఈ రెమెడీ మీ జుట్టును స్మూత్ అండ్ షైనీ గా మారుస్తుంది.
జుట్టు చిట్లడం విరగడం వంటివి తగ్గుతాయి.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.
జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.కాబట్టి వర్షాకాలంలో హెయిర్ ఫాల్ సమస్యకు దూరంగా ఉండాలని భావించేవారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని పాటించండి.
బెస్ట్ రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణలు చెప్పిన బాలయ్య హీరోయిన్.. సిగ్గుగా ఉందంటూ?