ఆడవారికి బెస్ట్ ప్రోటీన్ పౌడర్.‌. రోజుకో స్పూన్ తీసుకుంటే అంతులేని ప్ర‌యోజ‌నాలు!

ఆడవారు ప్రతి దశలోనూ శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు.వాటిని జయించి ఆరోగ్యమైన జీవితాన్ని గడపడం ఎంతో కష్టతరమైన పని.

చాలామంది ఆడవారు ఇంటి పని, వంట పని, కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటేనే ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలో తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మానేస్తుంటారు.ఫలితంగా చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలను( Health Problems ) ఎదుర్కొంటారు.

అందుకే ఆడవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.పోషకాహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి.

అయితే ఇప్పుడు చెప్పబోయే ప్రోటీన్ పౌడర్ ( Protein Powder )ఆడవారి ఆరోగ్యానికి అండగా నిలబడుతుంది.

రోజుకో స్పూన్‌ ఈ పౌడర్ ను తీసుకుంటే అంతులేని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందుతారు.

ప్రోటీన్ పౌడర్ తయారీ కోసం.స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు బాదం గింజలు( Almonds ), ఒక కప్పు గుమ్మడి గింజలు( Pumpkin Seeds ), ఒక కప్పు ఫూల్ మఖానా( Fool Makhana ), అరకప్పు జీడిపప్పు, అరకప్పు వేపుడు శనగలు, నాలుగు స్పూన్లు నువ్వులు విడివిడిగా వేయించి పెట్టుకోవాలి.

"""/" / ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించుకున్న పదార్థాలన్నిటినీ మెత్తని పౌడ‌ర్ మాదిరి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది.

ఈ ప్రోటీన్ పౌడర్ ను రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో వన్ టేబుల్ స్పూన్ చొప్పున‌ కలుపుకొని సేవించాలి.

ఆడవారికి ఈ ప్రోటీన్ పౌడర్ చాలా మేలు చేస్తుంది.ఎముకలు, కండరాల దృఢత్వానికి ఇది మ‌ద్ద‌తు ఇస్తుంది.

కణజాలాలను నిర్మించడం మరియు మరమ్మత్తు చేయడానికి తోడ్ప‌డుతుంది. """/" / రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే యాంటీబాడీస్ మరియు సైటోకిన్‌లను ఉత్పత్తి చేయడంలో ఉప‌యోగ‌ప‌డుతుంది.

అలాగే ఆడ‌వారు త‌ర‌చూ నీర‌సం, అల‌స‌ట‌కు గుర‌వుతుంటాయి.నిత్యం ఈ ప్రోటీన్ పౌడ‌ర్ తీసుకుంటే శరీరానికి బోలెడంత శ‌క్తి ల‌భిస్తుంది.

రోజంతా మీరు ఫుల్ ఎన‌ర్జిటిక్ గా ఉంటారు.అంతేకాదు ఈ ప్రోటీన్ పౌడ‌ర్ జ్ఞాపకశక్తి, దృష్టి మరియు మొత్తం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

రక్తంలో చక్కెరను స్థాయిని నియంత్రిస్తుంది.మరియు అతి ఆక‌లిని దూరం చేసి ఆరోగ్య‌మైన బ‌రువు నిర్వ‌హ‌న‌లో సైతం స‌హాయ‌ప‌డుతుంది.

నాని కి శ్రీకాంత్ ఓదెల మీద అంత నమ్మకం ఎందుకు..?