సమ్మర్ స్పెషల్.. వెయిట్ లాస్ కు బెస్ట్ జ్యూస్ ఇది..!

వెయిట్ లాస్( Weight Loss ) అవడం అనేది ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఒక గోల్ అయిపోయింది.

మీరు కూడా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా.? స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నారా.

? నిత్యం చెమటలు చిందేలా వ్యాయామాలు చేస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ మీకు ఎంత ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ జ్యూస్ సమ్మర్ లో ఆరోగ్యానికి అనుకూలంగా, వెయిట్ లాస్ కు మద్దతుగా నిలుస్తుంది.

మరి ఇంతకీ ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా బ్లెండ‌ర్ తీసుకుని అందులో అరకప్పు సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు( Cabbage Pieces ) వేసుకోవాలి.

అలాగే అరకప్పు కీర దోసకాయ ముక్కలు, ఒక కప్పు ఆపిల్ ముక్కలు( Apple Slices ), రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్ ( Lemon Juice )వేసుకోవాలి.

చివరిగా ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు పోసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకుని తాగేయడమే.

కావాలి అనుకుంటే ఈ జ్యూస్ లో మీరు నానబెట్టిన సబ్జా గింజలను కూడా కలుపుకోవచ్చు.

ఈ ఆపిల్ కుకుంబర్ క్యాబేజీ జ్యూస్ ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలను అందిస్తుంది.ముఖ్యంగా శరీర మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను రిమూవ్ చేస్తుంది.అదనపు కొవ్వును కరిగిస్తుంది.

నిత్యం ఈ జ్యూస్ ను తాగారంటే మీరు మీ బరువు తగ్గే లక్ష్యాన్ని ఇంకాస్త వేగంగా చేరుకోవచ్చు.

"""/" / అంతేకాకుండా ఈ జ్యూస్ కంటి చూపును షార్ప్ గా మారుస్తుంది.

సమ్మర్ లో డీహైడ్రేషన్ బారిన పడకుండా రక్షిస్తుంది.ఒంట్లో అధిక వేడిని తొలగిస్తుంది.

మరియు ఈ ఆపిల్ కుకుంబర్ క్యాబేజ్ జ్యూస్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గించడంలో కూడా అద్భుతంగా తోడ్పడుతుంది.