హెయిర్ ఫాల్ ను అరికట్టే బెస్ట్ హోమ్ మేడ్ సీరం ఇది..!

హెయిర్ ఫాల్ ( Hair Fall )అనేది అందరిలోనూ ఉండే సమస్య అయినప్పటికీ కొందరిలో మాత్రం చాలా హెవీగా ఉంటుంది.

జుట్టు అధికంగా రాలిపోవడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

హెయిర్ ఫాల్ ను అరికట్టడంలో ఈ సీరం సూపర్ ఎఫెక్టివ్ గా తోడ్పడుతుంది.

సీరం తయారీ కోసం ముందుగా ఒక బౌల్ లో రెండు టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ) మరియు అర క‌ప్పు వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.

వాటర్ బాయిల్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) మరియు నానబెట్టుకున్న మెంతులు వేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( Castor Oil ), వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మన సీరం అనేది రెడీ అవుతుంది.

"""/" / ఈ సీరంను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.

ఆపై షవర్ క్యాంపు ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒకసారి ఈ హోమ్ మేడ్ సీరం ను తయారు చేసుకుని వాడితే చాలా కొద్ది రోజుల్లోనే జుట్టు రాలడం తగ్గు ముఖం పడుతుంది.

జుట్టు కుదుళ్ళు దృఢంగా మారుతాయి. """/" / హెయిర్ ఫాల్ ను అడ్డుకోవడంలో ఈ సీరం సూపర్ పవర్ ఫుల్ గా పని చేస్తుంది.

పైగా ఈ సీరం హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది.హెయిర్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

పొడి జుట్టును రిపేర్ చేస్తుంది.హెయిర్ కు చక్కని హైడ్రేషన్ ను అందిస్తుంది.

పైగా ఈ సీరంను వాడడం వల్ల చుండ్రు సమస్యను కూడా దూరం చేసుకోవచ్చు.