మొండి మచ్చలను మాయం చేసే బెస్ట్ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ ఇది.. తప్పక ప్రయత్నించండి!

సాధారణంగా కొందరికి ముఖం మొత్తం మచ్చలు ఏర్పడుతుంటాయి.అవి చాలా అసహ్యంగా కనిపిస్తాయి.

అందాన్ని పాడు చేస్తాయి.పైగా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కొన్ని మచ్చలు పోనే పోవు.

అయితే అటువంటి మొండి మచ్చలను ( Stubborn Spots )మాయం చేసేందుకు ఒక బెస్ట్ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ ఉంది.

రెగ్యులర్ గా ఈ క్రీమ్ ను కనుక వాడితే కొద్దిరోజుల్లోనే స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతమవుతుంది.

ఇక మ‌రి ఆ క్రీమ్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో అర కప్పు బియ్యం( Half A Cup Of Rice ) వేసి వాటర్ తో రెండు సార్లు వాష్ చేయాలి.

ఆ తర్వాత బియ్యంలో ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు బియ్యం నుంచి వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రైస్ వాటర్ ను పూసుకోవాలి.

అలాగే ఒక కప్పు ఫ్రెష్ గులాబీ రేకులు( Rose Petals ), వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు( Green Tea Leaves ) వేసి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

"""/" / ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ ( Aloe Vera Gel )వేసుకోవాలి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ మరియు ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు రోజ్-గ్రీన్ టీ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేస్తే మన క్రీమ్ సిద్ధమవుతుంది.

"""/" / రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

రెగ్యులర్ గా ఈ నైట్ క్రీమ్ ను కనుక వాడితే కొద్ది రోజుల్లోనే ముఖంపై మచ్చలన్నీ మాయమవుతాయి.

స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతమవుతుంది.అలాగే ఈ క్రీమ్ చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మెరిపిస్తుంది.

మొటిమల సమస్యకు చెక్ పెడుతుంది.అలాగే కళ్ళ చుట్టూ నల్లటి వలయాల‌ను త‌గ్గించుకోవ‌డానికి కూడా మీరు ఈ క్రీమ్‌ను మీరు ఉపయోగించవచ్చు.

ఇండియన్ రెస్టారెంట్‌లో ఫిష్, చిప్స్ ఆర్డర్ చేసిన బ్రిటిషర్‌.. కానీ ఏం వచ్చాయంటే..?