వింటర్ లో చర్మాన్ని తేమగా ఉంచడానికి తోడ్పడే బెస్ట్ హోమ్ మేడ్ లోషన్ ఇదే!
TeluguStop.com
వింటర్ సీజన్ స్టార్ట్ అవుతోంది.ఇప్పుడిప్పుడే చలి పెరుగుతోంది.
చలి ప్రభావం మొదట తెలిసేది చర్మానికే.ఈ చలికాలంలో ప్రధానంగా చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
చల్లని గాలుల కారణంగా చర్మం తేమను కోల్పోతుంది.ఫలితంగా స్కిన్ డ్రైవ్ మరియు డల్ గా కనిపిస్తూ ఉంటుంది.
అయితే వింటర్ సీజన్ లో చర్మాన్ని తేమగా ఉంచడానికి, అందంగా మెరిపించడానికి తోడ్పడే బెస్ట్ హోమ్ మేడ్ లోషన్ ఒకటి ఉంది.
దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్(
Aloe Vera Gel ) వేసుకోవాలి.
అలాగే వన్ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ మరియు వన్ టీ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కలిపితే మన లోషన్ అనేది రెడీ అవుతుంది.
ఈ లోషన్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి. """/" /
ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేసిన తర్వాత తయారు చేసుకున్న లోషన్ ను బాడీకి అప్లై చేసుకోవాలి.
ఈ హోమ్ మేడ్ లోషన్ లో హీలింగ్ మరియు మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి.
అవి చర్మాన్ని తేమ గా ఉంచుతాయి.డ్రై స్కిన్( Dry Skin ) ను రిపేర్ చేస్తాయి.
కోకోనట్ ఆయిల్, విటమిన్ ఈ ఆయిల్ మరియు ఆల్మండ్ ఆయిల్ లో కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యవంతమైన చర్మానికి మద్దతు ఇస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సూర్యుడు మరియు ఇతర పర్యావరణ కారకాల వల్ల కలిగే నష్టం నుంచి మీ చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి.
అలాగే అలోవెరా జెల్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.గ్లోయింగ్ గా మెరిపిస్తుంది.
చర్మపు దురద, చికాకును తగ్గిస్తుంది.పైగా అలోవెరా జెల్ వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది మరియు బ్రేక్‌అవుట్‌లను తగ్గిస్తుంది.
చైనీయులను తెగ ఏడిపిస్తున్న విజయ్ సేతుపతి మహారాజ.. వీడియో వైరల్