దట్టమైన జుట్టును కోరుకునే పురుషులకు బెస్ట్ హోమ్ మేడ్ హెయిర్ టానిక్ ఇది!

సాధారణంగా కొందరి పురుషుల్లో జుట్టు( Hair ) చాలా పల్చగా ఉంటుంది.అధిక హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు.

ఈ రెండిటికీ చెక్ పెట్టి జుట్టును దట్టంగా మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టానిక్ మీకు ఉత్తమంగా సహాయపడుతుంది.

వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను వాడితే వద్దన్నా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

మ‌రి ఇంతకీ ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా చిన్న ఉల్లిపాయ( Onion ) ని తీసుకుని తొక్క తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే ఆరు వెల్లుల్లి రెబ్బలు( Garlic ) కూడా తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు మరియు వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ( Coffee Powder )వేసి మరిగించాలి.

దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాలు పాటు మరిగిస్తే మన హెయిర్ టానిక్ అనేది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది.

"""/" / అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె ( Mustard Oil )వేసి బాగా మిక్స్ చేసి ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.

ఆపై ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

"""/" / వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను వాడితే జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.

జుట్టు ఎదుగుదలకు చక్కని పోషణ అందుతుంది.కురులు దట్టంగా పెరుగుతాయి.

పురుషులు ఈ టానిక్ ను వాడటం అలవాటు చేసుకుంటే జుట్టును ఒత్తుగా మార్చుకోవచ్చు.

బట్టతలకు దూరంగా ఉండవచ్చు.మరియు ఈ టానిక్ చుండ్రు నివారణకు కూడా చాలా అద్భుతంగా తోడ్పడుతుంది.

స్పిరిట్ సినిమాలో నటించనున్న ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లేనా..?