పొట్లిపోయి దెబ్బ‌తిన్న మీ జుట్టును రిపేర్ చేసే బెస్ట్ ఎఫెక్టివ్ హెయిర్ ప్యాక్ ఇదే!

జుట్టు రాల‌డం, చుండ్రు త‌ర్వాత అత్య‌ధికంగా వేధించే స‌మ‌స్య‌ల్లో జుట్టు పొట్లిపోవ‌డం ఒక‌టి.

వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, పోష‌కాల కొర‌త‌, హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను త‌ర‌చూ వినియోగించ‌డం, ర‌సాయ‌నాలు ఎక్కువ‌గా ఉండే షాంపూల‌ను వాడ‌టం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు పొట్లిపోతుంటుంది.

దాంతో జుట్టును మ‌ళ్లీ మామూలు స్థితికి తెచ్చుకోవ‌డం కోసం నానా పాట్లు ప‌డుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ హెయిర్ ప్యాక్ ను ట్రై చేస్తే పొట్లిపోయి దెబ్బ‌తిన్న మీ జుట్టు రిపేర్ అవ్వ‌డం ఖాయం.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హెయిర్ ప్యాక్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో రెండు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడ‌ర్ వేసి ప‌ది నిమిషాల పాటు మ‌రిగించాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి కాఫీ డికాక్ష‌న్‌ను ఫిల్ట‌ర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు ఫుల్ ఎగ్స్‌, ఐదారు టేబుల్ స్పూన్లు గోరు వెచ్చ‌గా ఉన్న కాఫీ డికాక్ష‌న్‌, నాలుగు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడ‌ర్ వేసుకుని అన్నీ క‌లిసేంత వ‌ర‌కు బాగా మిక్స్ చేసుకుంటే.

హెయిర్ ప్యాక్ రెడీ అయిన‌ట్లే. """/"/ ఇక దీనిని ఎలా యూస్ చేయాలంటే.

మొద‌ట శుభ్రంగా హెయిర్ వాష్ చేసేసుకుని జుట్టును పూర్తిగా ఆర‌బెట్టుకోవాలి.ఆ త‌ర్వాత త‌యారు చేసుకున్న ప్యాక్ మిశ్ర‌మాన్ని త‌ల‌కు మ‌రియు జుట్ట కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్‌ను ధరించాలి.

గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేయాలి.

హెడ్ బాత్ అనంత‌రం కురుల‌ను కంప్లీట్‌గా డ్రై అవ్వనిచ్చి.గోరు వెచ్చ‌ని కొబ్బ‌రి నూనెను అప్లై చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే పొట్లిపోయి దెబ్బ‌తిన్న మీ జుట్టు రిపేర్ అవుతుంది.

కురులు ఆరోగ్యంగా మార‌తాయి.

ఎన్టీఆర్ తో సినిమా గురించి బామ్మర్ది షాకింగ్ కామెంట్స్.. ఆయన ముందు నేనెంతంటూ?