ఇదేం స‌ర‌దా.. కారుపై యువ‌కుడిని తాళ్ల‌తో క‌ట్టేసి 180 కి.మీ. స్పీడుతో..

కొందరు మ‌నుషులు నిత్యం ప్రమాదాలతో సై అంటారు.ఇందుకోసం కోసం వారు జీవితాలను కూడా లెక్క‌లోకి తీసుకోరు.

ఓ వ్యక్తి తన కారు పైకప్పుపై కూర్చొని వేగంతో ప్రయాణించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ప్ర‌పంచంలో ఎంతో మంది వెరైటీ వ్యక్తులు, వారి స్పెష‌ల్ కథనాలు ప్రపంచవ్యాప్తంగా మనం రోజూ చూస్తునే ఉన్నాం.

అటువంటా చాలా మంది తమ అభిరుచిని నెరవేర్చుకోవడంలో ఎక్క‌డిదాకైనా వెళ్తారు.ఈ నేప‌థ్యంలో ఎన్నో వింత పనులు చేస్తుంటారు.

రష్యలోని ఓ యువ‌కుడు రోడ్డుపై కారుతో అలాంటి ఓ ఫీట్ చేశాడు.నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన వారంత కొంత గగుర్పాటుకు గురయ్యారు.అయితే ఈ ప‌ని కాస్త ఆ వ్య‌క్తిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది.

అయితే ఆ వీడియోను నెట్టింట్లో చూసిన పోలీసులు రోడ్డుపై కారుతో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్న అతనిపై కేసు నమోదు చేశారు.

అనంత‌రం దర్యాప్తు మొద‌లు పెట్టారు.ఇలాంటి కొన్నివి కొన్ని సార్లు సంఘటనలు మన చుట్టూ జరుగుతుంటాయి.

అసలు విషయంలోకి వెళ్తే.రష్య కు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ డానిల్ మయాస్నికోవ్.

అత‌ని కారు పైకప్పుపై వేగంతో ప్రయాణించాడు.దానిని వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశాడు.

దాదాపు 180 కి.మీ వేగంతో వెళ్తున్న కారులో పైకప్పుపై కూర్చుని తన ప్రయాణించాడు.

కారుకు ఓవైపు టేప్, తాడు సహాయంతో తనను కట్టేసుకున్నాడు.ఈ వీడియోను డేనియల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు.

ఇలాంటి ప‌రిస్థితిలో కూడా ఎలాంటి భయం లేకుండా గాలిలో మాట్లాడుతూ.వీడియో తీశాడు.

అతని యొక్క స్నేహితులను రోడ్డుపై 112 Mph వేగంతో నడపమని కోరాడు.

ఈ కారు అత‌ని స్నేహితుడు నడుపుతున్నట్లు, కారు బయట తాళ్లతో బంధించినట్లు కనిపించడం చూడొచ్చు.

ఈ ఇయర్ సెకండాఫ్ లో సందడి చేయనున్న మన స్టార్ హీరోలు…