ఇది రహదారి కాదు యమపురికి దారి…!
TeluguStop.com
నల్లగొండ జిల్లా:పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రం నుండి దుగ్యాల గ్రామం వరకు గల ప్రధాన రహదారి గత కొన్నేళ్లుగా పట్టించుకునే నాథుడు లేక శిధిలావస్థకు చేరుకుంది.
ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు మొత్తం పూర్తిగా దెబ్బతినడంతో ఎక్కడ చూసినా కంకరతేలి, పెద్ద పెద్ద గుంతలు పడడంతో వాహనదారులు,ప్రయాణికులు నిత్యం నరకం చూస్తున్నారు.
ఈ రోడ్డుకు కనీసం తాత్కాలిక మరమ్మతులైనా చేయకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని అంటున్నారు వాపోతున్నారు.
ఈ దారి గుండా మండల కేంద్రానికి కనీసం ఆరేడు గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండానే వెళ్లాలాల్సి ఉందని, అయినా రవాణా వ్యవస్థ లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని,ఉదయం సాయంత్రం,రెండు పూటలు మాత్రమే ప్రయాణించే బస్సు కూడా మొన్న గుంతల్లో దిగబడి ప్రమాదం తప్పిందని, ఇప్పటికీ రోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని,ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సి వస్తుందని అంటున్నారు.
ఇప్పటికైనా సంబధిత అధికారులు స్పందించి ప్రమాదం జరిగి, ప్రాణనష్టం జరగకముందే రోడ్డు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని,త్వరగా నూతన రోడ్డు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఆ సలహా వల్లే బింబిసార హిట్టైందా.. అసలేం జరిగిందంటే?