ఇదేందయ్యా ఇది.. ఆటోరిక్షాలు కొనుగోలు చేస్తున్న యూకే పోలీస్..

మన దేశంలో ఆటోలు ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటాయి.ఆసియా, ఆఫ్రికా అంతటా అనేక దేశాలలో ఇటువంటి రవాణా వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి.

అయితే, యూరప్‌లో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కూడా ఆటో-రిక్షాలు కనిపించవు.అలాంటిది తాజాగా యూకేలోని గ్వెంట్ పోలీసులు దేశంలోకి ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను తీసుకొచ్చారు.

ఎక్కడ జోక్ ఏంటంటే పోలీసులు కొత్తగా ప్రవేశపెట్టిన ఆటో-రిక్షాలను పెట్రోలింగ్ పార్కులు, వాకింగ్ వేస్‌లో తిరగడానికి ఉపయోగిస్తారు.

రాత్రిపూట చిన్న పిల్లలు, మహిళలకు రక్షణ ఇచ్చేందుకు వీరు ఈ మూడు గిర్రల వాహనాల్లోనే ప్రయాణించనున్నారు.

దుబాయ్, ఇటలీ వంటి దేశాల్లో పోలీసులు అత్యంత లగ్జరీ కార్లను పెట్రోలింగ్ కోసం ఉపయోగిస్తుంటే.

ఈ బ్రిటిష్ పోలీసులు మాత్రం చిన్న వాహనాలను ఉపయోగించడానికి సిద్ధమై చాలా మందిని అవాక్కయ్యేలా చేస్తున్నారు.

బిహైండ్ ది బ్యాడ్జ్ డే ప్రదర్శనలో భాగంగా పోలీసులు ఈ వాహనాలను అందరికీ పరిచయం చేశారు.

ఈ ఆటో రిక్షాలు రాత్రిపూట ప్రజలకు రక్షణ కల్పిస్తాయని స్థానికులు నమ్మారు.ఇన్‌స్పెక్టర్ డామియన్ సౌరే ఆటోరిక్షాలు త్వరలో మోన్‌మౌత్‌షైర్‌లోని న్యూపోర్ట్, అబెర్గవెన్నీ వంటి ప్రాంతాలలో కూడా కనిపిస్తాయని పేర్కొన్నారు.

యూకే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తన ఆటో-రిక్షాల పరిచయం గురించి మహీంద్రా కూడా ఒక ద్వారా వెల్లడించింది.

నేర నిరోధక సలహా కోరే నివాసితుల కోసం, సంఘటనలను నివేదించడం లేదా అసురక్షితంగా భావించే వారి కోసం ఈ ఆటోలు ఆయా నగరాల్లో తిరగనున్నాయి.

అయితే పోలీసులు ప్రజల సంరక్షణ కోసం టాటా లింక్ చేయడానికి ఆటోలను వాడటం బహుశా ఇదే తొలిసారి కావచ్చేమో.

కార్లలో తిరిగితే నేరగాళ్ళు వెంటనే తప్పించుకోగలరు.అదే ఆటోలో తిరిగితే వారికి అనుమానం రాకపోవచ్చు.

అప్పుడు ఈజీగా వీరిని పట్టుకోవచ్చని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ వరకు కొత్తిమీర‌తో ఎన్ని బెనిఫిట్సో తెలుసా?