ఇదేందయ్యా ఇది, ఇక్కడ బీరు తాగాలంటే.. తొడుక్కున్న షూ పబ్ వాళ్లకి ఇవ్వాల్సిందే..
TeluguStop.com
బెల్జియం దేశంలోని ఘెంట్ అనే చిన్న పట్టణంలో ‘డల్లే గ్రిట్ ’(Dalle Grit) అనే ప్రత్యేకమైన పబ్ ఉంది.
ఇక్కడ కస్టమర్లు తాగే ముందు తమలో ఒక షూ పబ్ వాళ్లకు ఇవ్వాలి.
అవును, ఇది నమ్మడానికి కష్టంగా ఉన్నా బీర్ తాగే ముందు ముందుగా మనం తొడుక్కున్న ఒక షూ తీసి పబ్ ఉద్యోగికి ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ ఇచ్చే బీర్‌కు ప్రత్యేకమైన గ్లాస్ ఉంటుంది.ఆ గ్లాస్‌లో 1.
2 లీటర్ల బీర్(1.2 Liters Beer) వస్తుంది.
అంత పెద్ద గ్లాస్‌తో కస్టమర్లు పారిపోకుండా ఉండటానికి వాళ్ల షూను తీసుకుంటారు.అంటే, షూ ఒక రకమైన గ్యారంటీ లాంటిది.
ఇలాంటి విచిత్రమైన ఆచారం ఉన్న పబ్‌లు చాలా అరుదు.ఈ పబ్‌కి వెళ్లే ప్రతి ఒక్కరికీ ఇది ఒక ఆసక్తికరమైన అనుభవం.
ఆ చెప్పును ఒక గట్టి తాడుతో బార్‌పై వేలాడదీస్తారు.మీరు ఆ పెద్ద గ్లాసు బీర్ మొత్తం తాగిన తర్వాతే మీ చెప్పు/షూ(Sandals/Shoes) తిరిగి వస్తుంది.
"""/" /
ఈ విచిత్రమైన ఆచారానికి కారణం ఏంటంటే, ఆ పబ్‌లో వాడే గ్లాసులు చాలా ప్రత్యేకమైనవి.
వాటిని ఎవరూ దొంగతనం చేయకుండా, లేదా పగలగొట్టకుండా ఉండటానికి ఇలా చేస్తారు.ఒకవేళ ఆ గ్లాస్ పగిలిపోతే, ఆ వ్యక్తి 90 యూరోలు (సుమారు 8000 రూపాయలు) ఫైన్ కట్టాలి.
ఈ విచిత్ర ఆచారం వల్ల ‘డల్లే గ్రిట్' పబ్ చాలా ఫేమస్ అయింది.
ప్రజలు ఇక్కడ బీర్ తాగుతూ తీసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
"""/" /
రీసెంట్‌గా ఈ పబ్‌కి వెళ్లిన ఒక మహిళ తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
ఆ పబ్‌లో బీర్ తాగడానికి షూ ఇవ్వాలనే ఆలోచనే చాలా ఫన్నీగా ఉందని, కానీ అదే సమయంలో చాలా ప్రాక్టికల్‌గా ఉందని చెప్పింది.
మొత్తం మీద ఘెంట్‌కి వెళ్లి 1.2 లీటర్ల బీర్ తాగాలనుకునే వాళ్ళు తమ బీర్ మొత్తం తాగే వరకు ఒక చెప్పుతోనే తిరగాలి.
ఈ సంగతి తెలిసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
ముఖం మొత్తం మచ్చలేనా.. ఖరీదైన క్రీముల కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే రెమెడీ మీకోసం!