ఇదేం పిచ్చిరా బాబు.. ఫోన్‌లోని ఫుడ్ ఎమోజీలన్నీ తినడానికి ఈ వ్యక్తి ఎంత సాహసం చేశాడంటే!
TeluguStop.com
మీకు బాగా ఇష్టమైన ఫుడ్ కోసం ఎంత దూరం వెళ్తారు మహా అయితే పక్క ఊరు లేదా పక్క రాష్ట్రం.
కానీ, ఫుడ్ లవర్స్ కి దూరం ఒక లెక్క కాదు.అమెరికాకు చెందిన రిక్ షాపర్ అనే వ్యక్తి ఫుడ్ మీద తనకున్న వెర్రి ప్రేమను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు.
మన ఫోన్ కీబోర్డులో ఉండే ఫుడ్ ఎమోజీలు ఉన్నాయి కదా, వాటిల్లో కనిపించే ప్రతీ వంటకాన్ని తినాలనే వింత లక్ష్యంతో ఏకంగా అమెరికా నుంచి జపాన్‌కు విమానం ఎక్కేశాడు.
"""/" /
రిక్ షాపర్ తన ఈ క్రియేటివ్ ఫుడ్ జర్నీని మొత్తం వీడియో తీసి అందరితో పంచుకున్నాడు.
ఆ వీడియోలో అతను జపాన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ, రకరకాల అసలైన వంటకాలను టేస్ట్ చేయడం చూడొచ్చు.
ఇలా ఎమోజీ రూపంలో ఉన్న ప్రతీ ఫుడ్‌ను రుచి చూశాడు.అతను ఏ వంటకం తింటుంటే, దానికి సంబంధించిన ఎమోజీ స్క్రీన్‌పై కనిపించడం ఈ వీడియోను మరింత సరదాగా, క్రియేటివ్‌గా మార్చింది.
"""/" /
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, రిక్ కొన్ని సూపర్ ఫుడ్ స్పాట్‌లను కూడా సజెస్ట్ చేశాడు.