దీనినే అదృష్టం అంటారు… ఒకే ఒక్క డాలర్‌కు కొన్న పర్స్, లక్షలకు అమ్ముడుపోయిందిలా!

చాలామంది అదృష్టం గురించి మాట్లాడినప్పుడు అతిశయోక్తిగా ఉంటుంది గానీ, కొన్ని కొన్ని విషయాలు విన్నపుడు అదృష్టం అనే అంశం గురించి మనం కూడా ఆలోచించడం మొదలు పెడతాం.

ఇక్కడ కూడా అదే జరిగింది.ఈ విషయం మీరు విన్నారంటే, మీరు కూడా అదృష్టాన్ని నమ్మాలి అని చెబుతారు.

తాజాగా ఓ యువతి తనకు నచ్చిన పర్స్ ను ఒకే ఒక్క డాలర్ వెచ్చించి కొనుగోలు చేసింది.

ఆ పర్స్ రంగు రంగుల రాళ్లతో అందంగా తయారుచేయబడి ఉంది.అందుకే అది ఆమెని బాగా ఆకర్శించింది.

"""/" / అయితే ఆ పర్స్ కొనుగులు చేసిన సమయంలో మార్కెట్ లో దాని విలువ ఎంత ఉంటుందో కొనేవారికీ తెలియదు.

అలాగే కొన్న ఈమెకి కూడా తెలియదు.అయితే ఆ పర్స్ కు ఉన్న రాళ్లు.

సాధారణ రాళ్లు కాదని, విలువైన వజ్రాలని( Diamond ) తెలిసి షాక్ అయ్యింది.

ఇంకేముంది, కట్ చేస్తే లక్షాధికారిణి అయింది.'వజ్రం అసలు విలువ వజ్రాల వ్యాపారికి మాత్రమే తెలుస్తుంది' అనే నానుడి వీరి విషయంలో నిజం అయింది.

అదే వజ్రాలు సామాన్యుడి చేతిలోకి వస్తే వాటిని రాయిగా భావిస్తాడు.పర్స్ పై మెరుస్తున్న రాళ్లను చూసిన చాండ్లర్ వెస్ట్‌ మొదట ఏ విషయం అర్ధం కాలేదు.

"""/" / కానీ పురాతన వస్తువుల గురించి ఆసక్తి ఉన్న వ్యక్తులు.ఆ పర్స్ గురించి చాండ్లర్ వెస్ట్‌( Chandler West ) కు చెప్పగా ఆమెకి అప్పుడు అర్ధం అయింది.

అంతేకాదు ఈ పర్స్ 1920 సంవత్సరంలో తయారు చేసిన లగ్జరీ ఫ్రెంచ్ బ్రాండ్ కార్టియర్ పర్స్ ( CARTIER PURSE )అని కూడా చెప్పారు.

దాంతో ఆమె ఆ పర్స్ ను నగల వ్యాపారి వద్దకు తీసుకెళ్లింది.అనంతరం ఆ వ్యాపారి చాండ్లర్ పర్స్ ను వేలం వేయగా.

దాని ధర 9,450 డాలర్లు పలికింది.అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ.

7.8 లక్షలన్నమాట.

దీంతో ఒక డాలర్ కు కొన్న పర్స్ తో ఆమె ఒక్క రాత్రిలోనే లక్షాధికారిణి అయిపోయింది.

పుష్ప కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా..? లాంగ్ రన్ లో పుష్ప కలెక్షన్స్ ఎంత రావచ్చు..?