డ‌ల్‌గా ఉన్న చ‌ర్మాన్ని ఉత్తేజంగా మార్చే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

సాధార‌ణంగా ఒక్కోసారి ముఖ చ‌ర్మం డ‌ల్‌గా మారిపోతుంటుంది.కంటి నిండా నిద్ర లేక‌పోవ‌డం, వ‌ర్క్ స్ట్రెస్‌, ఎక్కువ సేపు జ‌ర్నీ చేయ‌డం, స్మార్ట్‌ఫోన్ ల్యాప్‌టాప్స్‌తో గంట‌లు గంట‌లు గ‌డ‌ప‌టం, ఆహార‌పు అల‌వాట్లు వంటి కార‌ణాల వ‌ల్ల ముఖం కాంతిహీనంగా, డ‌ల్‌గా త‌యారు అవుతుంది.

అలాంటి స‌మ‌యంలో చ‌ర్మాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో తెలీక తెగ మ‌ద‌న ప‌డిపోతూ ఉంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే గ‌నుక డ‌ల్‌గా ఉన్న చ‌ర్మాన్ని క్ష‌ణాల్లో ఉత్తేజ‌వంతంగా మార్చుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటీ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

వంటి విష‌యాల‌పై ఓ లుక్కేసేయండి.ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ప‌ది నుంచి ప‌దిహేను వాల్‌న‌ట్స్‌, అర క‌ప్పు వాట‌ర్ వేసి పేస్ట్‌లా గ్రౌండ్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఎర్ర కందిప‌ప్పు పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె, వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్‌, వ‌న్ టేబుల్ స్పూన్ విట‌మిన్ ఇ ఆయిల్ వేసి క‌లుపుకోవాలి.

"""/" / చివ‌రిగా అందులో వాల్‌న‌ట్ పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు నార్మ‌ల్ వాట‌ర్‌తో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం స్మూత్‌గా ర‌బ్ చేసుకుంటూ కూల్ వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే చ‌ర్మంపై పేరుకుపోయిన‌ మురికి, మృత క‌ణాలు తొల‌గిపోయి ముఖం ఫ్రెష్‌గా, కాంతివంతంగా మారుతుంది.

స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్‌గా త‌యారవుతుంది.అంతే కాదండోయ్‌ పైన చెప్పిన రెమెడీని వారంలో రెండు లేదా మూడు సార్లు ట్రై చేస్తే స్కిన్ టోన్ సైతం పెరుగుతుంది.

ప్రమాదంలో చేతిని కోల్పోయినా పతకాలు సాధించిన యువతి.. సక్సెస్ కు వావ్ అనాల్సిందే!