మూడు రోజుల్లో మెడ న‌లుపును పోగొట్టే ఎఫెక్టివ్ హోం రెమెడీ ఇదే!

ఆడ‌వారిని ప్ర‌ధానంగా మ‌ద‌న పెట్టే స‌మ‌స్య‌ల్లో మెడ న‌లుపు ఒక‌టి.ముఖం అందంగా, మృదువుగా మెరిసిపోతూ ఉంటే.

మెడ మాత్రం న‌ల్ల‌గా, చూపురుల‌కు అస‌హ్యంగా క‌నిపిస్తుంటుంది.దాంతో మెడ న‌లుపును వ‌దిలించుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

కొంద‌రైతే ఏవేవో ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.కానీ, ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ హోం రెమెడీని ట్రై చేస్తే ఇంట్లోనే సుల‌భంగా మెడ న‌లుపును పోగొట్టుకోవ‌చ్చు.

మ‌రి ఇంత‌కీ ఆ హోం రెమెడీ ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక ట‌మాటోను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే చిన్న ఉల్లిపాయ‌ను తీసుకుని తొక్క తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.హాఫ్ లెమ‌న్‌ను కూడా తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ట‌మాటో ముక్క‌లు, నిమ్మ‌పండు ముక్క‌లు, ఉల్లిపాయ ముక్క‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్ వేసుకుని మెత్త‌టి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి """/"/ ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలో వ‌న్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ ప‌సుపు వేసుకుని అన్నీ క‌లిసేంత వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మెడ‌కు అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం వేళ్ల‌తో సున్నితంగా మెడ‌ను రుద్దుకుంటూ వాట‌ర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై త‌డి లేకుండా ట‌వ‌ల్ తో మెడ‌ను తుడుచుకుని.

ఏదైనా మాయిశ్చ‌రైజ‌ర్‌ను రాసుకోవాలి.ఈ ప‌వ‌ర్ ఫుల్ రెమెడీని రోజుకు ఒక‌సారి ట్రై చేస్తే.

కేవ‌లం మూడు రోజుల్లోనే న‌లుపు పోయి మెడ తెల్ల‌గా, కాంతివంతంగా మారుతుంది.కాబ‌ట్టి, ఈ హోం రెమెడీని త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

ఆరెంజ్ తొక్కలతో అదిరిపోయే ఫేస్ సీరం.. రోజు వాడితే సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం!