కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని అరికట్టే సూపర్ సీరమ్ ఇదే!
TeluguStop.com
జుట్టు కుదుళ్లు బలంగా ఉంటే హెయిర్ ఫాల్ దానికదే కంట్రోల్ అయిపోతుంది.అందుకే మొదట జుట్టు కుదుళ్లను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించాలని నిపుణులు చెబుతుంటారు.
అందుకోసం పోషకాహారం తీసుకోవడమే కాదు ఇంటి చిట్కాలను కూడా పాటిస్తూ ఉండాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోం మేడ్ హెయిర్ సీరమ్‌ను వాడితే కనుక కుదుళ్లు బలోపేతం అవ్వడమే కాదు కేవలం కొద్ది రోజుల్లోనే జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.
మరి ఇంతకీ ఆ హోమ్ మేడ్ హెయిర్ సీరమ్‌ను ఎలా తయారు చేసుకోవాలి అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల కలోంజి సీడ్స్ వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్ పౌడర్ వేసుకుని.
నీరు సగం అయ్యే వరకు మరిగించాలి.అనంతరం స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ ను తీసుకుని అందులో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసుకోవాలి.
అలాగే తయారు చేసి పెట్టుకున్న కలోంజి సీడ్స్ వాటర్ ను వేసుకోవాలి.వీటితో పాటు వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, నాలుగు చుక్కలు పెప్పర్ మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేస్తే హెయిర్ సీరమ్ సిద్ధం అవుతుంది.
"""/"/
ఈ సీరమ్‌ను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
నైట్ నిద్రించే ముందు జుట్టు కుదుళ్లకు బాగా ఈ సీరమ్‌ను అప్లై చేసి కాసేపు మసాజ్ చేసుకోవాలి.
మరుసటి రోజు ఉదయం మైల్డ్ షాంపూను యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేస్తే జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.
తద్వారా హెయిర్ ఫాల్ క్రమంగా అదుపులోకి వచ్చేస్తుంది.మరియు జుట్టు ఒత్తుగా సైతం పెరుగుతుంది.
విమానం ఇంజన్‌లోకి దూసుకెళ్లిన పక్షి.. చివరికి ఏమైందో చూడండి..