కళ్ల కింద క్యారీ బ్యాగులను వేగంగా నివారించే సూపర్ రెమెడీ ఇదే!
TeluguStop.com
కంటి నిండా నిద్ర లేకపోయినా, కంప్యూటర్ల ముందు ఓవర్ టైమ్ వర్క్ చేసినా, ఒత్తిడి పెరిగినా కళ్ల కింద క్యారీ బ్యాగులు మాదిరి వాపులు వచ్చేస్తుంటాయి.
అలాగే ఎప్పుడూ ఏడుస్తూనే ఉండటం, ఆహారపు అలవాట్లు, ఎక్కువ గంటలు నిద్ర పోవడం, మద్యపానం వంటి కారణాల వల్ల కూడా కళ్ల కింద వాపులు ఏర్పడుతుంటాయి.
దాంతో ఈ క్యారీ బ్యాగులను నివారించుకోవడం కోసం ముప్ప తిప్పలు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ రెమెడీని ట్రై చేస్తే గనుక చాలా సులభంగా మరియు వేగంగా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వాసెలిన్, వన్ టేబుల్ స్పూన్ కొకనట్ ఆయిల్, రెండు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన పసుపు వేసుకుని కలుపుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని వాటర్ పోయాలి.నీరు బాగా మరిగిన వెంటనే అందులో అన్ని పదార్థాలు వేసుకున్న బౌల్‌ను పెట్టి ఒక నిమిషం పాటు స్పూన్‌తో తిప్పుకుంటూ హీట్ చేసుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకుని.ఒక బాక్స్‌లో నింపి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి.
ఇక దీనిని ఎలా వాడాలంటే.మొదట కొన్ని ఐస్ క్యూబ్స్‌ను పల్చటి వస్త్రంలో వేసి మూటగట్టి కళ్లపై కాసేపు అద్దుకోవాలి.
"""/" /
ఆపై తయారు చేసుకుని క్రీమ్‌ను కళ్ల కింద జాగ్రత్తగా అప్లై.
స్మూత్‌గా ఐదు నుంచి పది నిమిషాల పాటు వేళ్లతో మసాజ్ చేసుకోవాలి.ఇలా రాత్రి నిద్రించే ముందు చేసి.
ఉదయానే గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా చేస్తే గనుక కళ్ల కింద వాపులే కాదు.
నల్లటి వలయాలు ఉన్నా క్రమంగా తగ్గిపోతాయి.
కేజీఎఫ్ హీరో వాడే ఈ కారు ఖరీదెంతో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాకవ్వాల్సిందే!