వింటర్ లో జుట్టు తరచూ డ్రై గా మారుతుందా? అయితే ఇలా చేయండి!

ప్రస్తుత వింటర్ సీజ‌న్ లో చాలా మంది కామన్ గా ఫేస్ చేసే సమస్యల్లో డ్రై హెయిర్ ఒకటి.

వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా జుట్టు తరచూ డ్రైగా మారిపోతుంటుంది.దాంతో డ్రై హెయిర్ ను రిపేర్ చేసుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు.

కొందరైతే సెలూన్ కు వెళ్లి ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.కానీ ఇంట్లోనే చాలా సులభంగా మరియు సహజ పద్ధతిలో పొడిబారిన జుట్టును స్మూత్ అండ్ సిల్కీగా మార్చుకోవచ్చు.

అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె వేసుకోవాలి.

ఆ తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె, రెండు టేబుల్ స్పూన్లు ఆముదం, వన్ టేబుల్ స్పూన్ జోజోబా నూనె వేసుకోవాలి.

ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ క‌లోంజి సీడ్స్‌, వన్ టేబుల్ స్పూన్ డ్రైడ్ ఆమ్లా, వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ గ్లాస్ జార్ ను మరుగుతున్న నీటిలో పది నుంచి ప‌దిహేను నిమిషాల‌ పాటు ఉంచి హీట్ చేయాలి.

అనంతరం హీట్ చేసుకున్న ఆయిల్ ను పల్చటి వస్త్రం సహాయంతో సపరేట్ చేసుకొని చల్లార బెట్టుకోవాలి.

"""/"/ పూర్తిగా కూల్ అయిన‌ అనంతరం ఆయిల్‌ను ఒక బాటిల్ లో నింపుకోవాలి.

ఇక ఈ ఆయిల్ ను నైట్ నిద్రించడానికి గంట ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వరకు పట్టించి కాసేపు మసాజ్ చేసుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూ యూస్ చేసి తల స్నానం చేయాలి.

ఈ విధంగా చేస్తే పొడిబారిన జుట్టు సహజంగానే స్మూత్ అండ్ సిల్కీ గా మారుతుంది.

పైగా ఈ ఆయిల్ ను తరచూ వాడటం వల్ల జుట్టు రాలడం, విరగడం, పొట్లి పోవడం వంటి సమస్యలు సైతం తగు ముఖం పడతాయి.

నేను కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలిచింది అతనే.. సమంత క్రేజీ కామెంట్స్ వైరల్!