వ‌ర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ టీ ఇదే!

అస‌లే వ‌ర్షాకాలం న‌డుస్తోంది.ఈ సీజ‌న్‌లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఫ్లూ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్‌ల‌తో పాటు మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, జికా వంటి వ్యాధులు అధికంగా స‌క్ర‌మిస్తూ ఉంటాయి.

వీటితో పోరాడాలంటే రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లంగా ఉండాలి.కానీ, ఈ సీజ‌న్‌లో స‌హ‌జంగానే ఇమ్యూనిటీ సిస్ట‌మ్ వీక్ అయిపోతుంది.

దాంతో సీజ‌న‌ల్ వ్యాధులు మ‌న‌ల్ని అత‌లాకుత‌లం చేసేస్తుంటాయి.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సూప‌ర్ ప‌వ‌ర్ ఫుల్ టీని తీసుకుంటే ఇమ్యూనిటీ సిస్ట‌మ్‌ స‌హ‌జంగానే స్ట్రోంగ్‌గా మారుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ సూప‌ర్ టీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా రెండు ఉసిరి కాయ‌ల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డ‌గాలి.ఇలా క‌డిగిన ఉసిరి కాయ‌ల‌ను గింజ తొల‌గించి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే అర అంగుళం అల్లం ముక్క‌ను తీసుకుని తొక్క తొల‌గించి నీటిలో శుభ్రంగా క‌డిగి క‌చ్చ ప‌చ్చ‌గా దంచుకోవాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాట‌ర్ పోయాలి.

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో క‌ట్ చేసి పెట్టుకున్న ఉసిరి కాయ ముక్క‌లు, దంచి పెట్టుకున్న అల్లం వేసి బాగా మ‌రిగించాలి.

నీరు స‌గం అయ్యే వ‌ర‌కు హీట్ చేసి.స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇప్పుడు వాట‌ర్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని వ‌న్ టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేస్తే ఆమ్లా-అల్లం టీ సిద్ధం అవుతుంది.

"""/"/ చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ఈ టీని ఒక క‌ప్పు చ‌ప్పున ప్ర‌తి రోజు ఉద‌యాన్నే తీసుకుంటే.

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌లోపేతం అవుతుంది.సీజ‌న‌ల్ వ్యాధుల‌తో పోరాడే శ‌క్తి ల‌భిస్తుంది.

అలాగే.ఈ ఆమ్లా-అల్లం టీను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌ల నుండి వేగంగా బ‌య‌ట ప‌డ‌తారు.

మ‌రియు కంటి చూపు కూడా పెరుగుతుంది.

దర్శన్ నా కొడుకుతో సమానం.. సోషల్ మీడియాలో సుమలత సంచలన లేఖ వైరల్!