మోకాళ్ళ నొప్పులను తరిమికొట్టే సూపర్ లడ్డూ ఇది.. రోజూ తింటే లాభాలే లాభాలు!
TeluguStop.com
ఇటీవల రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మోకాళ్ళ నొప్పులతో( Knee Pain ) బాధపడుతున్నారు.
ఈ సమస్య కారణంగా ఎక్కువసేపు నిలబడాలన్నా, నడవాలన్నా, మెట్లు ఎక్కాలన్నా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.
పైగా నొప్పి నుంచి ఉపశమనం కోసం పెయిన్ కిల్లర్స్ ను ఎంపిక చేసుకుంటారు.
కానీ ఇది సరైన ఎంపిక కాదు.నిజానికి మోకాళ్ళ నొప్పులను తరిమి కొట్టే ఔషధాలు మన వంటింట్లోనే ఎన్నో ఉన్నాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సూపర్ లడ్డూను( Laddu ) నిత్యం కనుక తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు పరార్ అవ్వడమే కాదు బోలెడు ఆరోగ్య లాభాలు కూడా పొందుతారు.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పులు దోరగా వేయించిన అవిసె గింజలు( Flax Seeds ) వేసి బరకగా పొడి చేసుకుని ఒక బౌల్ లోకి వేసుకోవాలి.
ఆ తర్వాత అదే మిక్సీ జార్ లో ఒక కప్పు వేయించిన బాదం,( Almonds ) ఒక కప్పు వేయించిన ఫూల్ మఖానా, అర కప్పు వేయించిన జీడిపప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకుని అవిసె గింజల పొడిలో కలుపుకోవాలి.
"""/" /
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి ( Ghee ) మరియు ఒక కప్పు ఆర్గానిక్ బెల్లం తురుము వేసి పూర్తిగా మెల్ట్ అయ్యేవరకు ఉడికించాలి.
ఇలా ఉడికించిన బెల్లాన్ని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిలో వేసుకోవాలి.అలాగే అరకప్పు వేయించిన కొబ్బరి తురుము కూడా వేసుకుని బాగా మిక్స్ చేసి చిన్నచిన్న లడ్డూల మాదిరి చుట్టుకోవాలి.
"""/" /
ఈ అవిసె గింజల లడ్డూలు( Flax Seeds Laddu ) తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి.
అలాగే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.ముఖ్యంగా ఈ అవిసె గింజల లడ్డూలోని పోషకాలు ఎముకలను బలోపేతం చేస్తాయి.
మోకాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులను సమర్థవంతంగా దూరం చేస్తాయి.అలాగే ఈ లడ్డూలో ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్లు మెండుగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.
నిత్యం ఈ లడ్డూను తింటే అందులోని ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
ప్రోటీన్లు, మంచి కొవ్వులు ఉండటం వల్ల ఈ లడ్డూ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
మరియు శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ తగ్గించడంలోనూ ఈ అవిసె గింజల లడ్డూలు సహాయపడతాయి.
బార్లీతో అదిరిపోయే బ్యూటీ బెనిఫిట్స్..!