నెలసరి టైమ్ లో విపరీతమైన కడుపు నొప్పికి చెక్ పెట్టే సూపర్ డ్రింక్ ఇదే!
TeluguStop.com
నెలసరి సమయంలో చాలా మంది ఆడవారు విపరీతమైన కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతుంటారు.
ఆ కడుపు నొప్పి కారణంగా ఏ పని పైన దృష్టి సారించలేక పోతుంటారు.
ప్రశాంతంగా పడుకోలేకపోతుంటారు.ఈ క్రమంలోనే కడుపు నొప్పిని నివారించుకోవడం కోసం పెయిన్ కిల్లర్స్ ను వినియోగిస్తారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ ను తీసుకుంటే నెలసరి సమయంలో ఎలాంటి పెయిన్ కిల్లర్స్ ను వాడకుండానే సులభంగా కడుపు నొప్పి నుంచి విముక్తి పొందవచ్చు.
మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందు రెండు నిమ్మ పండ్లు తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.
ఇప్పుడు నిమ్మ పండ్లకు ఉన్న తొక్కను సపరేట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో నిమ్మ పండు తొక్కలు, వన్ టేబుల్ స్పూన్ లవంగాలు, రెండు బిర్యానీ ఆకులు, వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.
అనంతరం స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ తేనె ను మిక్స్ చేస్తే కడుపు నొప్పిని దూరం చేసే మన సూపర్ డ్రింక్ సిద్ధం అవుతుంది.
"""/"/
నెలసరి సమయంలో ఈ సూపర్ డ్రింక్ ను రోజుకు ఒకసారి తీసుకుంటే కడుపు నొప్పి మాత్రమే కాదు నడుము నొప్పి, కాళ్ళ నొప్పి తదితర నొప్పులన్నీ దూరం అవుతాయి.
అలాగే నెలసరి సమయంలో హార్మోన్స్ లో వచ్చే మార్పుల కారణంగా ఒత్తిడి, నీరసం వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి.
అయితే పైన చెప్పిన డ్రింక్ ను తీసుకుంటే కనుక ఒత్తిడి, నీరసం తగ్గు ముఖం పట్టడమే కాదు మానసిక ప్రశాంతత సైతం లభిస్తుంది.
రూ.16 లక్షలు నావే.. బ్యాంకు తప్పిదానికి రైతు షాక్ ట్రీట్‌మెంట్?