చెడు కొలెస్ట్రాల్ ను కరిగించే సూపర్ డ్రింక్ ఇది.. డోంట్ మిస్..!
TeluguStop.com
కొలెస్ట్రాల్ లో రెండు రకాలు ఉంటాయి.అందులో ఒకటి మంచి కొలెస్ట్రాల్ కాగా.
మరొకటి చెడు కొలెస్ట్రాల్( Bad Cholesterol ).శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయే కొద్దీ అనేక సమస్యలు తలెత్తుతాయి.
ముఖ్యంగా రక్తపోటు అదుపు తప్పుతుంది.గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది.
అందువల్ల చెడు కొలెస్ట్రాల్ ను కరిగించుకోవడం చాలా అంటే చాలా అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ సూపర్ పవర్ ఫుల్ గా పని చేస్తుంది.
రోజు ఉదయం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ క్రమంగా కరిగిపోతుంది.
మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ముందుగా అంగుళం అల్లం( Ginger ) ముక్క తీసుకుని పొట్టు తొలగించి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ అల్లం వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఆపై అందులో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon Juice ) మరియు పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా కలిపి నేరుగా సేవించాలి.
"""/" /
ఈ డ్రింక్ ను రెగ్యులర్ గా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.
రక్తపోటు అదుపులోకి వస్తుంది.గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
అంతేకాదు ఈ డ్రింక్ వెయిట్ లాస్( Weight Loss ) కు మద్దతు ఇస్తుంది.
శరీరంలో వేగంగా కేలరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది.అల్లం మరియు నిమ్మరసంలో ఉండే విటమిన్ సి, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెండ్స్ రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.
సీజనల్‌గా వచ్చే వ్యాధులను ఎదుర్కోవడానికి మన శరీరాన్ని సిద్ధం చేస్తాయి.ఇక జీలకర్ర జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.
గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.
చరణ్ మూవీ ఆడియో రైట్స్ కు రికార్డ్ రేట్.. ఫ్లాపులొస్తున్నా చరణ్ క్రేజ్ తగ్గట్లేదుగా!